గంటాను వైసీపీ నట్టేట ముంచుతుందా!! ఇక బీజేపీనేనా గంటాకు దిక్కు!!

Master plan behind Ganta resignation 

2019 ఎన్నికల వరకు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు వైసీపీ నాయకులపై ఎలాంటి కక్ష్యపూరిత రాజకీయాలు చేశారో అందరికి తెలుసు. అలాగే 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ కూడా ఇప్పుడు కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తుంది. ఈ కక్ష్యపూరిత రాజకీయాల నుండి తప్పించుకోవడానికి టీడీపీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. వైసీపీ నుండి వస్తున్న కష్టాల నుండి తప్పించుకోవడానికి టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు బీజేపీ లేదా వైసీపీ వైపు చూస్తున్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శశ్రీనివాసరావు కూడా తాను చేసిన తప్పులు నుండి తప్పించుకోవడానికి వైసీపీ చాలా ఆప్యాయంగా చేతులు చాస్తున్నారు కానీ ఇప్పుడు వైసీపీ గంటాను నట్టేట ముంచిందని వార్తలు వస్తున్నాయి.

Ganta Srinivasaro assets to be auctioned
Ganta Srinivasaro assets to be auctioned

గంటాకు హ్యాండ్ ఇచ్చిన వైసీపీ

వైసీపీ చేస్తున్న కక్ష్యపూరిత రాజకీయాల నుండి తప్పించుకోవడానికి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు. విశాఖలో టీడీపీని బలహీనపరచడానికి గంటాను పార్టీలోకి తీసుకోవడానికి వైసీపీ కూడా సిద్ధమైంది. అలాగే మూడు రాజధానుల విషయంలో కూడా విశాఖ ప్రజల నుండి మద్దతు కోసం గంటాను పార్టీలోకి తీసుకోవడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేశారు. కానీ విశాఖ గంటా పార్టీలోకి వస్తున్నాడని తెలిసినా కూడా విశాఖ ప్రజల నుండి మూడు రాజధానుల విషయంలో అనుకున్న స్థాయిలో మద్దతు రాలేదు. అదే విధంగా వైసీపీలో ఉన్న స్థానిక నాయకుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దింతో గంటాను పార్టీలోకి తీసుకునే నిర్ణయాన్ని వైసీపీ ప్రస్థుతానికి వాయిదా వేసిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.

గంటాను వైసీపీ ఇరికించనుందా!!

గతంలో తాను చేసిన తప్పులు నుండి తప్పించుకోవడానికి గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు కానీ ఇప్పుడు వైసీపీ ఆయనను దూరం పెడుతుంది. అలాగే గతంలో ఆయన చేసిన తప్పులకు సాక్షాలను సేకరించి పనిలో వైసీపీ ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. పెందుర్తి నియోజకవర్గంలో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన అనుచరుల దందా కూడా బయటపడిందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద పూర్తి విచారణ జరిపి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు అంటున్నారు. ఇలా విశాఖలో గంటా రాజకీయానికి చరమగీతం పాడటానికి వైసీపీ సిద్ధం అయింది.