ఎంపీలు వెర్సెస్ ఎమ్మెల్యేలు.. ఎక్కడికి వెళుతుందో ఈ గొడవ ?

అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో లుకలుకలు మామూలే.  వాటిని పార్టీ హైకమాండే  సర్దుబాటు చేసుకోవాలి.  ఏ పార్టీలో అయినా ఎంపీలే ఈ గొడవలను  పరిష్కరిస్తుంటారు.  కానీ వైసీపీలో మాత్రం రివర్స్ జరుగుతోంది.  ఎంపీలకే  సమస్యలు వచ్చిపడ్డాయి.  పార్టీలో ఉన్న 22 మంది ఎంపీలు 151 మంది ఎమ్మెల్యేల మీద గుస్సాగా ఉన్నారు.  అందుకు కారణం ఎమ్మెల్యేలు వారిని లెక్కచేయకపోవడమే.  ఎంపీల ద్వారా జరిగే పనులేవీ లేకపోవడంతో వారితో ఎమ్మెల్యేలకు అవసరం  లేకుండా పోయింది.  ప్రభుత్వం పరంగా పెద్దగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలేవీ లేవు.  ఆ కార్యక్రమాలే ఉంటే నిధుల కోసమో, అనుమతుల కోసమో ఎమ్మెల్యేలు ఎంపీల చుట్టూ తిరుగుతుంటారు.  కానీ ఇక్కడా సిట్యుయేషన్ లేదు. 

YSRCP MP’s versus MLA’s

జరిగే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎవ్వరి ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయి.  మధ్యవర్తుల అవసరం అస్సలు లేదు.  ఏ సంక్షేమ కార్యక్రమానికైనా నేరుగా జగన్ బటన్ నొక్కి నిధులు వదులుతున్నారు.  ఇక లబ్ధిదారుల ఎంపిక అయితే నూటికి నూరు శాతం వాలంటీర్ల ద్వారా జరిగిపోతోంది.  ప్రజలతో అనుసంధానమయ్యే అవసరం ఎమ్మెల్యేలకు లేకుండా పోయింది.  దీంతో వారికి కూడ ఎంపీల అవసరం రావట్లేదు.  దీంతో వారిని ఖాతరు చేసేవారే లేరు.  నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా వారిని పిలవడంలేదు.  ఈ గ్యాప్ వలనే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు సఖ్యత లేకుండా పోయింది. 

YSRCP MP’s versus MLA’s

ఈ పరిణామాన్ని గమనించిన ఎంపీలు పెద్దగా ఏమీ రియాక్ట్ కాలేకపోతున్నారట.  ఎందుకంటే ఎంపీలకు కనీసం సొంత నిధులు కూడ రావట్లేదు.  అవి అయినా వస్తే నియోజకవర్గంలో ఏదో చిన్నపాటి పనులైనా చేయవచ్చు.  అప్పుడైనా ఎమ్మెల్యేలకు ఎంపీలతో అవసరం పడుతుంది.  ఆ నిధులూ లేవు, ఎమ్మెల్యేలూ రావట్లేదు.  అందుకే సమయం కలిసొచ్చే వరకు కాస్త నిమ్మళంగా చూస్తూ ఉంటే సరిపోతుందని, ఎప్పటికైనా నిధులు రాకపోతాయా ఎమ్మెల్యేలు వెనక తిరగకపోతారా, దక్కాల్సిన గౌరవం దక్కకపోతుందా అనుకుంటూ ఎదురుచూస్తున్నారు.  ఈ గొడవలు ఇలా మౌనంగానే సాగితే పర్వాలేదు ముదిరి బహిర్గతమైతేనే సమస్యలు.