అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి అరుదైన గుర్తింపు వచ్చింది. కరోనా వైరస్ టెస్ట్‌లు, ఆ వ్యాధికి సంబంధించి చికిత్స విషయంలో చేసిన నూతన ఆవిష్కరణల పై, ఇటీవల జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్డీసీ) నిర్వహించిన పోటీలో ఏపీ నుండి రెండు ఆవిష్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది.
ఈ క్రమంలో అనంతపురంలోని శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ), ఏలూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థలు జాతీయస్థాయిలో ఈ ఘనత సాధించడం విశేషం. ఇక ఎస్ఆర్ఐటీ చేసిన ఆవిష్కరణ, వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రూపొందించడం జరిగింది.
దీంతో ఓ ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అని జాతీయ మీడియాల్లో సైతం వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా జొన్నలగడ్డ పద్మావతి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఎంటెక్ చదివిన ఎమ్మెల్యే పద్మావతి, కరోనా వైద్య చికిత్స అందించే క్రమంలో, వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా ఉండే క్యాబిన్ రూపొందించారు. దీంతో ప్రస్తుతం జొన్నలగడ్డ పద్మావతి తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారారు.