2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పతనానికి చేరుకున్న టీడీపీని వైసీపీ నాయకులు మరింత దీనస్థితికి చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుండి చాలా మంది నేతలు వైసీపీ బాట పడుతున్నారు. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, కరణం వెంకటేష్ లాంటి యువనేతలు వైసీపీకి చేరుకున్నారు. అయితే ఇప్పుడు మరో యువ నేతకు వైసీపీ నాయకులు గాలం వేస్తున్నారు. ఈ గాలానికి ఆ టీడీపీ నేత చిక్కితే మాత్రం టీడీపీ అక్కడ భూస్థాపితం అవుతుంది.
ఎవరా నేత !
తాజాగా వైసీపీ గాలమేస్తున్న ఆ టీడీపీ యువనేత ఎవరంటే కర్నూలు టీడీపీ ఇన్‌చార్జ్ టీజీ. భరత్. గత ఎన్నికల్లో కర్నూలు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి మహ్మద్ హఫీజ్‌ఖాన్ చేతిలో ఓడిపోయారు. కర్నూల్ లో ఇప్పుడు టీడీపీని బతికిస్తున్న ఏకైక నాయకుడు భారత్. కర్నూల్ లో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇలాంటి సందర్భంలో టీడీపీని భారత కాపాడుతున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ మాత్రం ఆ నేతను పట్టించుకోకపోవడం వల్ల వైసీపీ గాలమేస్తుంది.
భారత్ అవసరం వైసీపీకి ఉందా!!
భారత్ ను ఇప్పుడు టీడీపీ నేతలే పట్టించుకోడవం లేదు. అలాంటి నేతను ఇప్పుడు వైసీపీ ఎందుకు గాలం వేస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. భారత్ కు వైసీపీ ఎందుకు గాలం వేస్తుందంటే టీడీపీలో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను కూడా వైసీపీ టార్గెట్ చేస్తూ తమ పార్టీలోకి లాగేస్తోంది. ఇదే భరత్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్‌బాబు సైతం వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు భరత్‌ను పార్టీలో చేర్చుకుంటే అటు వైశ్య కమ్యూనిటీని అక్కున చేర్చుకున్నారన్న ప్లస్ పాయింట్‌తో పాటు టీడీపీకి ఉన్న బలమైన ఆర్థిక వనరుల్లో ఒక వికెట్‌ను పడగొట్టడమే వైసీపీ టార్గెట్. ఇలా జగన్ రచించిన వ్యూహం వల్ల రానున్న రోజుల్లో టీడీపీ కర్నూల్ లో మరింత బలహీనపడుతుంది.