2019 ఎన్నికల్లో ఒక పార్టీ రాజకీయంగా ఎంతలా దెబ్బకొట్టగలరో అంతలా వైసీపీ నాయకులు టీడీపీ నాయకులను దెబ్బకొట్టారు. అప్పుడు వైసీపీ నాయకులు కొట్టిన దెబ్బకు టీడీపీ నాయకులు ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన షాక్ కు రాష్ట్రంలో అన్న గారు స్థాపించిన టీడీపీ పతనావస్థకు చేరుకుంది. అయితే వైసీపీ నాయకుల దాహం ఇంకా తీరలేదు. టీడీపీ రాష్ట్రంలో లేకుండా పూర్తిగా పతనం చెయ్యడానికి పతకాలు రచిస్తోంది. ఇప్పుడు టీడీపీ కంచు కోట అయిన నరసరావుపేటపై వైసీపీ కన్ను పడింది.
నరసరావుపేటను వైసీపీ స్వాధీనం చేసుకోనుందా!!
ఏపీ అధికార పార్టీ వైసీపీ, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జిల్లాల పునర్వవ్యస్థీకరణ దాదాపు పట్టాలెక్కింది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని చాలా ప్రాంతాల ప్రజలను ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే అభివృద్ధి విషయంలో ఎంతో వెనకపడిన పల్నాడును కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆ ప్రాంత వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చూస్తుంది. రాజకీయంగా పల్నాడు అంతగా పనికి రాదని భావించిన జగన్ గుంటూరు జిల్లాలో ఉన్న నరసరరావు పేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ చాలా బలంగా ఉంది. ఆ బలాన్ని దెబ్బతియ్యడానికే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
కొత్త జిల్లాల వల్ల వైసీపీకి లాభం ఉందా!!
కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తూ రాజకీయంగా లబ్దిపొందడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఏ ప్రాంతాల్లో అయితే టీడీపీ బలంగా ఉందొ ఆ ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటిస్తూ అక్కడ తమ బలాన్ని పెంచుకోవడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అలాగే పాలనా పరంగా జగన్ చేసిన ఉత్తమ కార్యక్రమంగా కూడా వైసీపీకి గుర్తింపు వస్తుంది. ఎలా చూసుకున్నా కూడా జిల్లాల విభజన ప్రక్రియ వైసీపీకి కలిసి రానుంది.