ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.. విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ అని ఓ సినిమాలో వచ్చిన పాట కొందరి జీవితాల్లో నిజం అవడం అప్పుడప్పుడు జరుగుతుంది. ఇప్పుడూ వైసీపీలో ఇదే జరుగుతుందట.. నిన్న మొన్నటి వరకు లయన్ అని అనుకున్న కొడాలి నాని విషయంలో ఊహించని ట్వీస్ట్ ఎదురైందని కొందరు నాయకులు కోడై కూస్తున్నారు.. అతి తొందరపాటు వల్ల వచ్చే అనర్ధాలు ఎంతకు దారి తీస్తాయో కొడాలి నాని తీరును చూస్తే అర్ధం అవుతుందంటున్నారు.. ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే.. కొద్ది రోజులుగా కొడాలి నాని టీడీపీ పైన, చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలాంటి సమయంలో నానిని ఎవ్వరూ ఏమీ అనలేదు సరి కదా ఆయన నోటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ఏవి జరగలేదు.. దీంతో నాని మరింతగా రెచ్చిపోయి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విషయంలో నోరు జారారు..
ఒకపార్టీ నుండి మరొక పార్టీలోకి జంప్ అయితే పోయేది ఏమి ఉండదు.. కానీ కేంద్రానికి సంబంధం లేని విషయంలో మోదీని టార్గెట్ చేయడం మూలంగా బీజేపీ నేతలు నానినే కాకుండా.. అటు ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నాని వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీన్ని బట్టి నానికి సొంత పార్టీలో కాంట్రవర్సీ వ్యాఖ్యల విషయంలో సపోర్ట్ లేదని అర్థమవుతోంది.
ఇకపోతే మరో మంత్రి గుమ్మూరు జయరాం సైతం వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయన కూడా ఏకాకి అవుతున్నారు.. వైసీపీ కేంద్రప్రభుత్వం విషయంలో సానుకూలంగా ఉండగా, వైఎస్ జగన్ కూడా మోదీతో కలిసి ముందుకు సాగుతున్న సమయంలో వీరి ప్రవర్తన వల్ల బీజేపీకి, వైసీపీకి ఎక్కడ చెడుతుందో అనే ఆందోళన వైసీపీ వర్గాల్లో కనిపిస్తుందట. మొత్తానికి సీయం జగన్‌తో పాటుగా నాయకులందరు బీజేపీతో దోస్తీ కడుతుంటే వీరు మాత్రం అమందుకు విభిన్నంగా ప్రవర్తించడం చర్చాంశనీయంగా మారింది..