2014 నుండి 2019 వరకు టీడీపీ నాయకుల చేతిలో నలిగిపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు అధికారం చేతిలోకి రావడంతో రెచ్చిపోతున్నారు. ఎంతలా రెచ్చిపోతున్నారంటే సొంత పార్టీ కార్యకర్తలను కూడా చంపేంతగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులపై పార్టీలోకి లాక్కోవడానికి వారిని ఇష్టమొచ్చినట్టు ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా కడపలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వైసీపీ నేత మరణించారు.
రాళ్లతో కొట్టి చంపిన వైసీపీ నేతలు
కడప జిల్లా, కొండాపురం మండలం, పింజి అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వైసీపీ నేత రామసుబ్బా రెడ్డిల మధ్య గతకొంత కాలం నుండి ఆధిపత్య పోరు నడుస్తుంది. అయితే గండికోట ప్రాజెక్ట్ ముంపు పరిహారం విషయంలో అవకతవకలు జరిగాయని రామసుబ్బా రెడ్డి మద్దతుదారుడైన గురు నాథ్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ కోసం గ్రామ సభ నిర్వహించగా అక్కడికి వచ్చిన మరోవర్గం వైసీపీ నాయకులు గురునాథ్ రెడ్డిని రాళ్లతో,రాడ్స్ తో దాడి చెయ్యగా తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. దింతో పోలీసులు గ్రామాన్ని అదుపులోకి తీసుకున్నారు.
కోపం రగలిపోతున్న జగన్
అసలే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ప్రజలకు దగ్గరకు వెళ్లడం కంటే కోర్ట్ ల చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలే ఇలా కొట్టుకుంటూ, చంపుకుంటూ ఉన్న నేతలపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ప్రతిపక్షాలపై కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తున్నానరని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ నేతలే ఇలా చంపుకోవడం వైసీపీకి మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఘటనపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.