AP: వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆపటం ఎవరి తరం కాదు… బాబు ప్రభుత్వానికి శని పట్టింది: అంబంటి

AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా జనాలు రాకుండా ఉండటం కోసం ఎన్నో ఆంక్షలు విధిస్తూనే ఎక్కడికక్కడ అభిమానులకు అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే ఈ అడ్డుకట్టలను తెంచుకొని మరి ప్రజలు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఇటీవల జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్లడంతో ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు పెట్టింది పోలీసులు అభిమానులపై లాఠీ చార్జ్ చేశారు. అలాగే జనాలు వెళ్ళకుండా రోడ్లను తవ్వించి ముళ్ళ కంచె వేశారు.

ఇలా అభిమానులను ఎక్కడికి అక్కడ అడ్డుకున్న పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడం విశేషం. ఇక ఈ పర్యటన గురించి మాజీ మంత్రి అంబంటి రాంబాబు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైయస్ జగన్ ప్రజా బలాన్ని చూసి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అంబంటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ఐదుసార్లు ఇప్పటివరకు సింగపూర్ వెళ్లారు అయితే సింగపూర్ నుంచి ఒక్క పెట్టుబడిని కూడా సాధించలేకపోయారని తెలిపారు.

చంద్రబాబు నాయుడు తప్పు చేసి జైలుకు వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ను కలవడానికి మాత్రమే వెళ్లారని అంబంటి తెలిపారు. పైగా మాపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.ఏపీలో పెట్టుబడి పెట్టేది లేదని సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దానికి కారణం వైఎస్సార్‌సీపీ నేతలంటూ ఆరోపణలు చేస్తున్నారు. మురళీకృష్ణచౌదరి అనే టీడీపీ వ్యక్తే సింగపూర్ ప్రభుత్వానికి ఈ-మెయిల్ చేశారని తేలింది. అతని ఆస్తులను వారి పార్టీ నేతలే కబ్జా చేశారన్న కారణంతో ఈ-మెయిల్ చేశారట. అలాంటి వ్యక్తిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా ఎలా చిత్రీకరిస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి శని పట్టిందని అందుకే పాలన పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తనని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం చంద్రబాబు తరం కాదు కదా చిట్టి నాయుడు తరం కూడా కాదని ఈ సందర్భంగా అంబంటి రాంబాబు తెలిపారు.హోంమంత్రి అనిత అదేపనిగా జగన్‌ని తిట్టటమే పనిగా పెట్టుకుంది. జగన్‌ని తిడితే మంత్రి పదవి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే కొందరు ఐపిఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు.