AP: గత ఐదు సంవత్సరాల కాలంలో వై ఎస్ జగన్ హన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎవరు ఊహించని విధంగా ఉండేవని చెప్పాలి అలాంటి వాటిలో శాసనమండలి కూడా ఒకటి. అప్పట్లో శాసనమండలిలో టిడిపి మెజారిటీ అధికంగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో శాసన మండలిని రద్దు చేస్తూ, అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయించారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తీర్మానాన్ని పంపించారు. ఇలా శాసనమండలని రద్దుచేస్తే అక్కడ అధిక మెజారిటీ ఉన్న టిడిపి నుంచి తమకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవన్న కారణంతోనే జగన్ ఈ శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ శాసన మండలి లేకపోయి వుంటే, మూడు రాజధానుల పేరుతో, రాష్ట్రాన్ని వైసీపీ మూడు ముక్కలు చేసేదే.! ఆ తర్వాత వైసీపీకి శాసన మండలిలో మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం వైసీపీకి శాసనసభలో కంటే కూడా మండలిలోనే అధిక మెజారిటీ ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరు శాసనమండలిలో వైసిపి సభ్యులు తీసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇక శాసనసభకు జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన ఎమ్మెల్యేలు ఎలాగో వెళ్లారు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డికి నేడు శాసనమండలి మాత్రమే దిక్కుగా మారింది. చట్ట సభల్లో వైసీపీ ఉనికి అంటే, అది శాసన మండలి ద్వారానే వైసీపీకి సాధ్యమవుతోంది. కానీ, ఇది ఎన్నో రోజులు ఇలాగే కొనసాగే పరిస్థితి లేదు. ఎందుకంటే, శాసన మండలి సభ్యులు ఒకరొకరుగా వైసిపికి దూరమవుతూ వస్తున్నారు.
ఏది ఏమైనా ఒకప్పుడు శాసనమండలిని రద్దు చేయాలనుకున్న జగన్ నిర్ణయం తప్పని ఈ రోజు అదే శాసనమండలిలోని సభ్యులు జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున నిలబడి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాస్తయినా పార్టీ పరువును కాపాడుతున్నారని చెప్పాలి. మరి శాసనమండలి సభ్యుల గడువు పూర్తి అయితే తదుపరి చర్యలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.