Home News వైఎస్సార్ అంటే కేవలం పేరు కాదు.. అదొక బ్రాండ్.!

వైఎస్సార్ అంటే కేవలం పేరు కాదు.. అదొక బ్రాండ్.!

Ysr Is Not Just A Name, It Is A Brand

వైఎస్సార్ అంటే ఓ పేరు మాత్రమే కాదు, అదొక బ్రాండ్. ఔను, తెలుగు నాట వైఎస్సార్ అంటే, బలమైన శక్తి. వైఎస్సార్ మరణించి దశాబ్ద కాలం దాటేసింది. అయినా, ఆయన పేరు తెలుగు నాట రాజకీయాల్లో మార్మోగుతూనే వుంది. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ కొత్త పార్టీ పెట్టారనీ, వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారని కాదు.

తెలుగు నేలపై వైఎస్సార్ చేసిన సంక్షేమ సంతకం అలాంటిది. సంక్షేమం కలగలిసిన అభివృద్ధి వైఎస్సార్ నినాదం. పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య చికిత్స అందేందుకు వీలుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తెరపైకి తెచ్చారు వైఎస్సార్. పేదవాడికి ఉన్నత చదువుల దిశగా ఫీజు రీ-ఎంబర్సుమెంట్ పథకాన్ని రూపొందించి, అమలు చేశారు. ఒకటా.? రెండా.? చెప్పుకుంటూ పోతే చాలానే.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా చెప్పుకుంటోన్న పోలవరం ప్రాజెక్టు కావొచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావొచ్చు, పలు ఎత్తి పోతల పథకాలు కావొచ్చు.. వీటిని జలయజ్నం పేరుతో నిర్మించతలపెట్టిన ఘనుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చి, టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డుని బద్దలుగొట్టేందుకు సిద్ధమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, మరణం హెలికాప్టర్ ప్రమాదంలో వరించింది. లేకపోతే, ఇప్పటికీ తెలుగునాట రాజన్న పాలన కొనసాగేదేమో.. అసలు ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయేది కాదేమో.

వైఎస్సార్ జెండా ఆంధ్రప్రపదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపంలో రెపరెపలాడుతోంది. త్వరలో తెలంగాణలోనూ రాజన్న పాలన ఖాయమంటున్నారు వైఎస్సార్ కుమార్తె షర్మిల. వైఎస్సార్ జయంతి నేపథ్యంలో నేడు షర్మిల తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ పాలనను తలపించేలా ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో వైఎస్ జగన్ తనవంతు ప్రయత్నిస్తున్నా.. జగన్ పాలనని వైఎస్సార్ పాలనతో పోల్చలేమన్నది చాలామంది చెబుతోన్నమాట. మరి, షర్మిల తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగురవేస్తారా.? వేస్తే, తండ్రిని మించిన తనయ.. అనిపించుకుంటారా.? వేచి చూడాల్సిందే.

Related Posts

హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్...

బద్వేలు ఉప ఎన్నిక: వైసీపీకి పోటీ ఇచ్చేంత సీన్ వుందా.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ేడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (వైసీపీ)...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News