మాజీ మంత్రి వివేకా హత్యకు అతనికి పలువురితో వున్న సంబంధాలే కారణమా అని సిబిఐ విచారణ చేస్తుంది. వివేకా సన్నిహితులను గుర్తించి విచారణకు పిలుస్తుంది.
కడప నగరానికి చెందిన ఇద్దరు మహళలను రెండు రోజులగా ప్రశ్నిస్తుంది సిబిఐ. వైయస్ వివేకా హత్య కేసును విభిన్న కోణాల్లో విచారణ చేస్తుంది సిబిఐ. తొలి విడతగా వచ్చిన సిబిఐ హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వివేకా నివాసంతో పాటు అక్కడ ఎవరెవరు వుంటారు అనే విషయాన్నీ ఆరా తీసింది. ఇంటి పరిసరాలను క్షుణ్ణం గా పరిశీలించింది. అక్కడ వున్న వారిని విచారణకు పిలిచి వివిధాంశాలు ఆరా తీసింది.
వివేకా భార్య, కూతురుతో పాటు పాటు వివేకా పీఏ, వంట మనిషి, వాచ్మాన్, ఆఫీస్ సిబ్బంధిని పలుమార్లు ప్రశ్నించింది సిబిఐ.
రెండో విడతలో వచ్చిన సిబో బృందాలు వివేకా కు వున్న సంబంధాలను టార్గెట్ చేసింది. ముఖ్యంగా వివేకాకు సన్నిహితంగా వున్నవారిని గుర్తుంచి విచారణకు పిలుస్తుంది.
వైయస్సార్ కుటుంబంలో కీలక వ్యక్తిగా మాజీ ఎంపీ గా మంత్రి గా వివేకా కి పలువురితో సన్నిహిత సంబంధాలు వున్నాయి. నిత్యం ప్రజలతో సన్నిహితంగా తిరిగే వివేకాకు అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు వున్నాయి అని సిబిఐ భావిస్తుంది. ఈ క్రమంలో హత్యకు దారితీసిన కారణాలు ఏంటని సిబిఐ శోధిస్తుంది. కడప నగరానికి చెందిన ఇద్దరు మహిళలిని రెండు రోజులుగా విచారిస్తుంది సిబిఐ. వివేకాకు వారితో గల సన్నిహిత సంబంధాలు వున్నాయన్న సమాచారంతో వారిని రెండో సారి కూడా సుదీర్ఘంగా ప్రశ్నిస్తుందత సిబిఐ.
అలాగే పులివెందులకు చెందిన సురేంద్రతో పాటు మరో ఆరుగురిని సిబిఐ విచారించింది. వీరితో పాటు కర్నూల్ నగరంలో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఒక వైద్యుడ్ని కూడా సిబిఐ ప్రశ్నిస్తుంది. మొత్తానికి వివేకాతో పలువురిటీకి గల సంబంధాలతో పాటు హత్యకు దారితీసే విభేధాలు ఎవరితో వున్నాయి అనే కోణంలో కూడా ఆరాతీస్తోంది సిబిఐ..