Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పార్టీని అధః పాతాళానికి తొక్కేస్తాను అన్న విధంగానే గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే రాష్ట్రంలో వైకాపా పార్టీ అనేది లేకుండా చేయాలన్న సంకల్పంతోనే ఈయన పని చేస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే వైకాపా పార్టీకి బలమైన పునాదులుగా నిలిచినటువంటి కడపని టార్గెట్ చేస్తూ ఈయన అక్కడ రాజకీయాలను మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా మూడుసార్లు కడపలో పర్యటన చేశారు. కడపలో ఎక్కువగా మెగా అభిమానులు ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా తన వైపుకు తిప్పుకోవాలనే ఆలోచనలో పవన్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇటీవల పల్లె పండుగ, టీచర్ పేరెంట్స్ మీటింగ్ అంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ పవన్ కడపలోనే ప్రారంభం చేశారు.
ఇక తాజాగా ఎంపీడీవో జవహర్ బాబు పై వైకాపా నాయకులు దాడికి దిగడంతో పవన్ కళ్యాణ్ తనని పరామర్శించడం కోసం కడపకు వెళ్లారు. ఇక ఈ సందర్భంగా ఈయన సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన కడపలో పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కడపలో ఏర్పాటు చేయాలా లేక పులివెందులలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ పులివెందుల పైన తన ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. అక్కడ వైయస్ వివేకానంద రెడ్డి ఇల్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆ ఇంటిని తన పార్టీ కార్యాలయంగా మార్చుకోవాలనే ఆలోచన చేయడమే కాకుండా ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతతో కూడా ఇదే విషయం గురించి చర్చలు జరిపారని తెలుస్తుంది. ఇలా కడుపలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి వైకాపా పార్టీకి కంచుకోట అయినటువంటి వైసీపీ పునాదులను పెకిలించే ఆలోచనలో పవన్ ఉన్నారని తెలుస్తోంది.