YS Sharmila: విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇలా విజయ్ సాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అలాగే వైకాపా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతూ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు ఇలాంటి వ్యక్తి ఉన్నఫలంగా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే విషయంపై అందరూ చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే వైయస్ షర్మిల విజయసాయిరెడ్డి రాజీనామా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏ పని చేయరు. జగన్ ఏది చెబితే ఆ పని చేయటమే విజయ్ సాయి రెడ్డి పని. ఆయన రాజకీయాల పరంగా కాదు వ్యక్తిగత జీవితంలో కూడా నా బిడ్డల గురించి ఆపద్దాలు చెప్పారని షర్మిల విమర్శించారు.
ఇలా జగన్మోహన్ రెడ్డి ఆడించినట్లు ఆడే విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజీనామా చేయడం వెనుక కూడా జగన్ మోహన్ రెడ్డి పథకం ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను కోల్పోయారు అందుకే ఆయనకు ఎంతో కీలకంగా ఉన్న నేతలందరూ కూడా పార్టీని వదిలి బయటకు వస్తున్నారు తన వాళ్లను రక్షించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
జగన్ బీజేపీకి దత్త పుత్రుడని ఆరోపించారు. తనను తాను కాపాడుకోవడానికే సాయిరెడ్డిని బీజేపీకి పంపించాడని ఆరోపించారు. ఇన్నాళ్లు సాయి రెడ్డిని పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడన్నారు. జగన్ విశ్వసనీయతను కోల్పోవడం వల్లే అందరూ బయటకు వస్తున్నారు. ఇక బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి వివేక నంద రెడ్డి హత్య కేసు గురించి నిజాలు మాట్లాడటం సంతోషకరమన్నారు అలాగే మరికొన్ని నిజాలు అన్నింటిని కూడా బయట పెడితే బాగుంటుంది అంటూ షర్మిల వివేకానంద రెడ్డి రాజకీయ రాజీనామా గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.