YS Sharmila: వైయస్ షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈమె కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కంటే కూడా తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడం పైన ఎక్కువ ధ్యాస పెట్టారని చెప్పాలి. కూటమి ప్రభుత్వం కంటే కూడా షర్మిల వీలు దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వచ్చారు.. అయితే ఈమె తన వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని విమర్శలకు గురి చేస్తున్నారని చెప్పాలి.
ఇదిలా ఉండగా నిన్నటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా వైకాపా 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరయ్యారు అయితే గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టడంతోనే ఒక్కసారిగా వీరందరూ గవర్నర్ పోడియంను చుట్టుముడుతూ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేయడమే కాకుండా అనంతరం బాయ్ కాట్ చేస్తూ బయటకు వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై వైయస్ షర్మిల ఘాటుగా స్పందించారు.జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధ్యక్షులు జగన్ తీరు మాత్రం మారలేదని మొదలు పెట్టారు. అనంతరం.. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది..? ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా..? సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా… అంటూ వరుస ప్రశ్నలు వేస్తూ ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా… ప్రజల శ్రేయస్సు కంటే కూడా మీకు పదవులే ముఖ్యమని మరోసారి అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు. ప్రజా సమస్యలపై మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్లాలని తెలిపారు. ఇక అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే మీ పదవిలకు రాజీనామా చేయాలి అంటూ ఈమె డిమాండ్ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.