పాలేరు నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తా: వైయస్ షర్మిల

తాజాగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని అక్కడ కొన్ని విషయాలు పంచుకున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని అన్నారు. ఇప్పటి నుంచి షర్మిల ఊరు పాలేరు అని.. వైయస్సార్ ఫోటో ఖమ్మం జిల్లాలో ఎంతో మంది గెలిచారు అని..

ఆయన బలం మన సొంతం అని అన్నారు. వైయస్ఆర్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలనే కోరిక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అని.. ఇక ఇప్పుడు తన కోరిక కూడా అదే అని.. కాబట్టి వైఎస్సార్ సంక్షేమ పాలన పాలేరు నుంచి ప్రారంభం కానుందని అన్నారు.