వైఎస్ రాజారెడ్డి ని నేటి తరం జనరేషన్ కి బాగా తెలిసేలా చేసింది టీడీపీ జాతీయ కార్యదర్శి లోకష్. నిజానికి లోకేష్ అంత గట్టిగా చెప్పకపోయుంటే రాజారెడ్డి గురించి పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి ఎవరంటే? తెలిసింది చాలా తక్కువ ముందికే. ఎందుకంటే రాజారెడ్డి పెద్ద రాజకీయనాయకుడేం కాదు. రాష్ర్ట స్థాయి రాజకీయాలలలో ఆయన ముద్ర అంటూ ప్రత్యేకంగా లేదు. కమ్యునిస్ట్ పార్టీ సానుభూతి పరుడిగా సీపీఐ అభ్యర్ధులకు కడప జిల్లా పులివెందలలో ఏజెంట్ గా ఉండేవారు. స్వగ్రామంలో సర్పంచ్ గా మాత్రమే పనిచేసారు. అంతకు మంచి రాజారెడ్డి రాజకీయాలలో సాధించిందేం లేదు.
కాబట్టి రాజారెడ్డి రాజకీయం అనేది కడప జిల్లాకే పరిమింతం. ఆ జిల్లా వాసులకే రాజారెడ్డి గురించి బాగా తెలిసి ఉంటుంది. అయితే లోకేష్ రాజారెడ్డి పేరు వాడుకునే జగన్ మోహన్ రెడ్డిని తరుచూ విమర్శించడం చేస్తుంటాడు. జగన్ పాలనని రాజారెడ్డి పాలన అంటూ… రాజారెడ్డి రాసిన రాజ్యంగాన్ని జగన్ అనుసరిస్తున్నాడని పదే పదే పనిగట్టుకుని దాడి చేస్తుంటాడు. మరి రాజారెడ్డి పాలన గురించి చినబాబు కి ఏం తెలుసో! లేక రాజారెడ్డి కాలంలో కూడా చినబాబు మొదటి జన్మ ఎత్తాడో ఏంటో తెలియదుగానీ..ఇలాంటి అర్ధ పర్ధం లేని విమర్శలు మాత్రం పరిపాటిగా మారాయి. అయితే ఇక్కడ లోకేష్ కి మరో ఆప్షన్ కూడా లేదనుకోండి.
ఎందుకంటే వైఎస్సార్ పేరు ఎత్తితే జగన్ క్రేజ్ అంతకు రెండింతలు అవుతుంది. వైఎస్సార్ పాలన గురించి లోకేష్ మాట్లాడితే? ఏం జరుగుతుందో? కూడా తెలుసు. అందుకే విమర్శల సమయంలో పెద్దాయన పేరు తీసుకురాకుండా…ఆయన తండ్రిగారి పేరును తీసుకొచ్చి జగన్ ని ఎద్దేవా చేస్తుంటాడు. అక్రమంగా ఇసుక తరలిస్తోన్న వైసీపీ నాయకుడ్ని ఒక దిళత వర్గానికి చెందిన యువకుడు ప్రశ్నిస్తే అతినికి ప్రభుత్వం అండ చూసుకుని శిరోముండనం చేయించాడు. ఈ వివాదం రాష్ర్ట పతి దృష్టికి వెళ్లింది. సాటి దళితుడుకి న్యాయం చేయాల్సిన మంత్రి నక్సలైట్లలో చేరమనడం రాజారెడ్డి రాజ్యాంగం అమలుకి ప్రత్యక్ష నిదర్శమని లోకేష్ తాజాగా ట్వీట్ చేసాడు. అయితే శిరోముండనం చేయించిన ట్రైనీ ఎస్సైని, కానిస్టేబుల్ ని అరెస్ట్ చేయడం ఇప్పటికే జరిగింది.