వైఎస్ జగన్ హౌసింగ్ స్కీమ్.. పేద లబ్దిదారులంతా సూపర్ హ్యాపీ.

Ys Jagan's Housing Scheme, Super Duper Hit

Ys Jagan's Housing Scheme, Super Duper Hit

ముంపు ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు ఇచ్చారనీ.. ఇంకోటనీ.. రకరకాల వివాదాలు నిన్న మొన్నటిదాకా వినిపించాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన పేదలకు ఇళ్ళ స్థలాల వ్యవహారానికి సంబంధించి. ఉత్త స్థలాలు కాదు.. జగనన్న కాలనీలు, జగనన్న ఊళ్ళు.. అంటూ జగన్ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. లబ్దిదారులు తమ తమ భూముల్లో శంకుస్థాపనలు షురూ చేశారు.

ఇళ్ళ నిర్మాణ పనులు వేగం పుంజుకోబోతున్నాయి. ప్రభుత్వమే రకరకాల ఆప్షన్లు ఇచ్చి లబ్దిదారుల ఇళ్ళ కోసం స్కీమ్ అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే.

దాంతో, తక్కువ సమయంలోనే ఇళ్ళ నిర్మాణం పూర్తయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు, అవినీతికీ తావు లేకుండా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది.

ఇళ్ళ నిర్మాణం కంటే మౌళిక వసతుల కల్పన అత్యంత కీలకమైన విషయం. దశాబ్దాలుగా పేదల కోసం ప్రభుత్వాలు ఇళ్ళ స్థలాల్ని, ఇళ్ళనీ నిర్మిస్తూ వస్తున్న విషయం విదితమే. కానీ, అవేవీ లబ్దిదారులకు అనుకూలంగా వుండడంలేదు.

మరి, జగన్ సర్కార్ ఇస్తోన్న ఇళ్ళ పరిస్థితేంటి.? చరిత్రలో వైఎస్ జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా పేదలకు ఇళ్ళ నిర్మాణం అనేది జరుగుతుందంటూ అధికార పార్టీ బల్లగుద్ది మరీ చెబుతోంది. అయితే, ఇప్పటికీ చాలా చోట్ల ముంపు కారణంగా.. పేదల ఇళ్ళ స్థలాల్లో శంకుస్థాపనలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడిది వర్షా కాలం.

దాంతో ముంపు ఇంకా ఎక్కువ వుండబోతోంది. మరి, జగన్ సర్కార్ పేరు నిలబెట్టేలా ఇళ్ళ నిర్మాణం వుంటుందా.? లేదంటే, విమర్శల సుడిగుండంలోకి ఈ ఇళ్ళ నిర్మాణం స్కీమ్ నెట్టివేయబడుతుందా.? వేచి చూడాల్సిందే.