జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్ దిశగా ?

Political
వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాల మీద వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.  30 లక్షల మంది పేదలకు ఉచితంగా భూములిచ్చి అందరి మన్ననలు పొందాలనేది జగన్ ప్లాన్.  ఉగాది రోజునే ఈ కార్యక్రమం చేయాలని వైకాపా సర్కార్ స్థానిక ఎన్నికల కారణంగా ఎన్నికల సంఘం అడ్డు చెప్పడంతో జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయాలని అనుకున్నారు.  కానీ కోర్టులో పిటిషన్లు నమోదవడంతో మళ్లీ వాయిదా పడింది.  ఆ తర్వాత ఆగష్టు 15కు మార్చారు.  ఎలాంటి పరిస్థితుల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున పంపిణీ జరుగిపోతుందని అన్నారు.  అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైంది. 
YS Jagan
 
ఇదొక సమస్య అయితే భూముల సేకరణ, సేకరించిన భూములు మీద సమస్యలు తలెత్తడం మరొక సమస్యగా మారింది.  మొత్తం సేకరించిన 26 వేల ఎకరాల్లో కొన్ని వేల ఎకరాలు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని కోర్టులో పిటిషన్లు పడ్డాయి.  సేకరించిన వాటిలో 1307 ఎకరాలు ఖనిజ, పశువుల మేత కోసం కేటాయించిన భూములు కావడంతో వాటిని పంచడానికి కుదరదని తేల్చేశారు.  ఇక మార్కెట్ ధర కంటే లక్షల అధిక ధర పెట్టి కొన్న 600 ఎకరాలు మొన్న కురిసిన వానలకి వచ్చిన వరదలకు నీట మునగడంతో అవి కూడ నివాసయోగ్యం కాదని తేలింది.  కాబట్టి వాటిని పెంచుతామంటే జనం అస్సలు ఒప్పుకోరు. 
 
ఇక తాజాగా తిరుమలగిరిలో గిరిజన సంక్షేమ పాఠశాల భూములను కూడా జనానికి పంచాలని అనుకోగా కోర్టులో పిటిషన్లు పడ్డాయి.  దీంతో కోర్టు ఒక అవసరం కోసం కేటాయించిన భూములను ఇంకో అవసరం కోసం ఎలా వాడతారు.. కుదరదు అంటూ మొట్టికాయలు వేసింది.  ఈ పరిణామాలతో అసలు ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందా లేదా అనే అనుమానం జనంలో మొదలైంది.  ఇప్పటికే ఏర్పడిన అడ్డంకులు చూస్తే ఆ సందేహం రావడంలో విచిత్రమేమీ లేదు.  మరి ఈ సమస్యలు, అడ్డంకులు తొలగేది ఎప్పుడో జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అమలయ్యేది ఎప్పుడో చూడాలి.