‘ సైలెన్స్ తన ఆయుధం ‘ జగన్ గురించి అద్భుత విశ్లేషణ !

Ys jagan

రాజకీయాల్లో చాలామంది నాయకులు ఎక్కువగా మాట్లాడుతూ తక్కువ పని చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువగా మాట్లాడటం వల్ల తప్పులు మాట్లాడుతూ ఇతర నాయకుల నుండి విమర్శలు ఎదుర్కొంటు ఉంటారు. అయితే ఇంకొంతమంది చాలా తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ పని చేస్తూ ఉంటారు. ఇలా తక్కువగా మాట్లాడేవాళ్ళు అవసరమైన్నప్పుడు మాత్రమే మాట్లాడుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనులు చేయడంపై దృష్టి పెట్టారు.

Ys jagan
Ys jagan

మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాడు

మాటలు చెప్పి తప్పించుకునే రకం జగన్ మోహన్ రెడ్డి కాదు. అయాన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాడు. జగన్ మోహన్ రెడ్డి తన మౌనం ప్రతిపక్షాల చాలా సందర్భాలలో సమాధానం ఇచ్చారు. వైజాగ్ లో ప్రమాదం జరిగినప్పుడు ప్రతిపక్షాల నాయకులు ఇంట్లో ఉండి విమర్శలు చేస్తుంటే జగన్ మాత్రం సంఘటన సస్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అలాగే అంతర్వేది రథం దగ్ధం అయినప్పుడు కూడా ప్రతిపక్షాల నాయకులు చేస్తున్న విమర్శలకు సీబీఐతో చెక్ పెట్టాడు. తిరుమలకు వెళ్లిన జగన్ పై జరిగిన మత ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సింపుల్ గా తన వేషధారణతో ఆ విమర్శలకు జగన్ చెక్ పెట్టారు. ఇలా మౌనంతోనే జగన్ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మౌనాన్ని అర్ధం చేసుకోలేని ప్రతిపక్షాల నాయకులు జుట్టు పీక్కుంటున్నారు.

జగన్ మౌనం ప్రతిపక్షాలకు శాపం

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా మాటలు చెప్పకుండా సైలెంట్ గా పనులు చేస్తూ వెళ్తుండటంతో ప్రతిపక్షాల నాయకులు ఏమి చేయాలో, జగన్ ఎలా విమర్శించాలో అర్ధం కావడం లేదు. ప్రతిపక్షాల నాయకులు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం మాటలతోనే కాలక్షేపం చేశారు కానీ జగన్ మాటలు చెప్పకుండా పనులు చేస్తూ తన పాలనా విధానాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మౌనం ప్రతిపక్షాల పాలిట శాపంగా మారింది…