అమరావతిని రాజధానిగా నిర్మిస్తామంటే తాము సాగు చేసుకునే పంటలనుఁ కూడా రైతులు ఇచ్చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. అయితే 2019 ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు అమరావతిని రాజధానిగా కాకుండా మూడు రాజధానుల ప్రతిపాదనకు తెరలేపింది. దీంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వారి బాధను పట్టించుకోవడం లేదు. పైగా వాళ్ళను అవమానాలకు గురి చేస్తున్నారు. నిన్నటితో రైతుల ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకుంది. అయితే దీనిపై కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా వ్యగ్యాంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
బీసీల సంక్రాంతికి పోటీగా, అమరావతి ఉద్యమ కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టారని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమను వెల్లడిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులను ఇలా రాజకీయ పార్టీకి కట్టబెడుతూ వాళ్ళను కించపరుస్తున్నారు. కేవలం టీడీపీ మీద ఉన్న కోపంతో, వైరంతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అమరావతి ఉద్యమం వెనుక తెలుగుదేశం పార్టీ వుందా.? మరో పార్టీ వుందా.? కులాల పెత్తనం అమరావతి ఉద్యమంపై వుందా.? వంటి విషయాల్ని పక్కన పెడితే, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఆందోళనలు చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. రాజధాని కోసం అర ఎకరం భూమి ఇచ్చిన రైతు కూడా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో తలపడుతున్నాడిప్పుడు. ఇదీ వాస్తవ కోణం.
ఈ దిశగా వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడుగులు వెయ్యలేకపోతుందో ఎవ్వరికి అర్ధంకావడం లేదు. రాజకీయ దృష్టితో సమస్యను చూస్తూ రైతులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. పైగా ఉద్యమం చేస్తున్న వారిపై రాజకీయ ముద్ర వేస్తూ రైతులను కించపరుస్తున్నారు. అమరావతిలో టీడీపీ అక్రమాలకు పాల్పడింది కాబట్టే రాజధానిని మార్చామని వైసీపీ చెప్తున్న నేపథ్యంలో అధికారంలోకి ఇన్ని రోజులు అవుతున్న ఇంకా ఎందుకు టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలకు మాత్రం వైసీపీ నాయకులుసమాధానం చెప్పారు . రాజకీయ కోణంలో రైతుల సమస్యలను చేస్తూ, వాళ్ళను కించపరుస్తున్న జగన్ రెడ్డికి రానున్న రోజులలో ప్రజలే బుద్ధి చెప్తారు.