దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలు దేశం మొత్తం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అక్కడ వచ్చిన ఫలితాలను చూసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ కు గురి అయ్యారు. దుబ్బాకలో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. అదే సమయంలో అక్కడ నుండి బీజేపీ తరపున రఘునందన రావు పోటీ చేశారు. అప్పుడు ఆయన పోటీ చేసినట్టు కూడా చాలామందికి తెలియదు కానీ ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కంచుకోటలాంటి దుబ్బాకలో. టీఆర్ఎస్ ఓడిపోవడానికి కేసీఆర్ యొక్క ఓవర్ కాంఫిడెన్స్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.దుబ్బాక ఎన్నికల విషయంలో కేసీఆర్ చేసిన తప్పులను తిరుపతి ఉప ఎన్నికల్లో చేయబోమని వైసీపీ నాయకులు చెప్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని కేసీఆర్ లో ఉన్న అతి విశ్వాసమని, ఆ అతి విశ్వాసంతోనే దుబ్బాకలో కనీసం ప్రచారం కూడా చేయలేదని అందుకే ఓడిపోయింది సొంత పార్టీ నేతేలే చెప్తున్నారు. అయితే ఇప్పుడు తిరుపతిలో జరగనున్న ఉప ఎన్నికలో మొదట నుండే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొననున్నారని సమాచారం. ఇప్పటికే ప్రణాళిక కూడా సిద్ధమైందని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ ఎన్నికలు తిరుపతి వరకే పరిమితం కాదని రాష్ట్రం మొత్తం ఈ ఎన్నికలను చూస్తుంది కాబట్టి ఈ ఎన్నికలను రాజకీయంగా కూడా ఉపయోగించుకోవడానికి జగన్ సిద్ధమయ్యారని తెలుస్తుంది.
ఈ ఎన్నికలను ఆధారంగా చేసుకొని వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన అభివృద్ధి గురించి కూడా రాష్ట్రా ప్రజలకు చెప్పడానికి జగన్ సిద్ధమయ్యారని, అలాగే పోలవరం విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను, ఇప్పుడు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీని సైతం ఎండకట్టడానికి ప్రణాళికలు జగన్ సిద్ధం చేశారని సమాచారం. దుబ్బాక ఎన్నికలు టీఆర్ఎస్ కు మాత్రమే కాకుండా అన్ని పార్టీల నేతలకు ఎదో రకంగా రాజకీయ పాఠాలను, గుణపాఠాలను నేర్పించింది.