వైసీపీని వీడుతున్న కార్యకర్తలు, ఆందోళనలో వైఎస్ జగన్

స్వర్ణా ప్యాలెస్ యాక్సిడెంట్ కేసులో జగన్ అత్యవసర ఆదేశాలు .. అతిపెద్ద ఛేజింగ్ నడుస్తోంది.

రాజకీయాల్లో పార్టీలను నడిపించేది కార్యకర్తలు. పార్టీ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారేమో కానీ క్షేత్రస్థాయిలో పని చేసేది మాత్రం కార్యకర్తలే. అలాంటి కార్యకర్తలను పార్టీ పెద్దలు కన్నబిడ్డలను చూసుకున్నట్టు చూసుకోవాలి కానీ ఇప్పుడు వైసీపీలో మాత్రం కార్యకర్తలు పార్టీని అస్సలు పట్టించుకోవడం లేదు. అలాగే కార్యకర్తలను కూడా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే అర్ధం అవుతుంది. ఎన్నికల సమయంలో మాత్రమే తమను దగ్గరకు తీసుకుంటున్నారని, మిగితా సమయంలో తమను పట్టించుకోవడం లేదని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

cm jagan ap
cm jagan ap

కార్యకర్తలను పట్టించుకోని జగన్

2019 ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడ్డారు. జగన్ తమ నెత్తిమీద పెట్టుకొని సీఎం కుర్చీపై కూర్చోపెట్టారు, వైసీపీ నాయకులకు ఘన విజయం ఇచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను వైసీపీ నాయకులు పట్టించుకోవడం లేదు. వాళ్ళను అసలు దగ్గరకు కూడా రానివ్వడం లేదు. పైగా టీడీపీ నుండి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటినుండో పార్టీ కోసం పని చేస్తున్న పక్కన పెడుతున్నారని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.

వైసీపీ పతనం మొదలైందా!!

జగన్ విజయంలో కీలక పాత్ర పోషించిన పాదయాత్ర పూర్తి అయి మూడేళ్ళు అయిన సందర్భంగా ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు పది రోజుల పాటు పాదయాత్రలు చేయాలని పార్టీ పెద్దలు ఆదేశిస్తే క్రేత్ర స్థాయిలో అధికార పార్టీ నేతలు తుస్సుమనిపించారు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కడ కనిపించలేదు. దీనికి కారణం కార్యకర్తలకు సరైనా ఆదరణ లేదు. దానితో పాటు ఏడాదిన్నరగా పార్టీని జగన్ సహా అంతా మరచిపోయారు. ఇపుడు స్థానిక ఎన్నికలు ఉన్న్నాయన్న ఉద్దేశ్యంలో ఈ పాదయాత్ర ప్రొగ్రాం ని ఉన్న ఫళంగా డిజైన్ చేశారు. అయితే పద్దెనిమిది నెలలుగా తమను పట్టించుకోని పార్టీ కోసం తామెందుకు పనిచేయాలని క్యాడర్ కస్సుమంటోంది. ఇలా పార్టీ కార్యకర్తలు పార్టీకి దూరం అవుతుండటంతో పార్టీ యొక్క పతనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.