Home Andhra Pradesh జగన్ ఈగో మీద దెబ్బ కొట్టిన సుప్రీం కోర్టు - ఇది చాలా సీరియస్ మ్యాటర్...

జగన్ ఈగో మీద దెబ్బ కొట్టిన సుప్రీం కోర్టు – ఇది చాలా సీరియస్ మ్యాటర్ !

2019 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోర్ట్ ల నుండి తగలుతున్న ఎదురుదెబ్బలు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికే దాదాపు 100పైగా సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోర్ట్ ల నుండి ఎదురు దెబ్బలు తగిలాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ప్రభుత్వానికి, న్యాయ స్థానానికి ఒకరకమైన యుద్ధం జరుగుతుంది. తాజాగా న్యాయ వాదులపై సీఎం జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖ ఈ వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబి వెంకటేశ్వరరావు రూపంలో న్యాయ స్థానం దగ్గర ఘోరమైన అవమానం జరిగిందని చెప్పాలి.
Ab Venkateswara Rao | Telugu Rajyam

జగన్ పై అధికారుల తిరుగుబాటు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ హయాంలో పని చేసిన ఎన్నికల కమిషినర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబి వెంకటేశ్వరరావు పై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే నిమ్మగడ్డ కోర్ట్ కు వెళ్లి తన పదవిని తాను తిరిగి పొందగా ఇప్పుడు వెంకటేశ్వర రావు కూడా కోర్ట్ కు వెళ్లారు. . ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్ట్, ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి, ఆయనకు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న జీతం కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా వెంకటేశ్వర రావు కూడా తన పదవిని తాను దక్కించుకున్నారు. సరైన ఆధారాలు లేకుండా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అధికారులు ఎదురు తిరగడంతో జగన్ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది.

జగన్ ప్రభుత్వానికి అవమానం

Cm Jagan
cm jagan

వెంకటేశ్వర రావు విషయంలో హైకోర్టు ఇచ్చిన సస్పెన్షన్ రద్దు ఉత్తర్వులు ఎత్తివేయాలి అంటూ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనికి సంబందించిన విచారణ జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే ఈ కేసు విచారణ తన ముందుకు రావటంతో, ఈ కేసు విచారణ నుంచి తాను వైదొలుగుతున్నట్టుగా జస్టిస్ లావు నాగేశ్వరరావు చెప్పారు. ఈ కేసు నాట్ బిఫోర్ మీ అంటూ ఈ కేసుని వేరే బెంచ్ కు విచారణకు తీసుకుంటే బాగుటుందని తప్పుకున్నారు. తప్పుకోవడానికి గల కారణాలను మాత్రం చెప్పలేదు. అయితే జగన్ ప్రభుత్వం ఏకంగా సుప్రీం కోర్టు జడ్జిల పై, కాబోయే చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా పైనే , వివిధ ఆరోపణలు ఆపాదించి, అలాగే వైసీపీ పార్టీ సోషల్ మీడియా, కులం పేరుతో జడ్జిలను అల్లరి చేస్తున్నారు కాబట్టి ఆ వివాదాల్లో ఉండటం ఇష్టం లేకపోవడం వల్లే నాగేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. న్యాయ వ్యవస్థపై, ప్రభుత్వ అధికారులపై సరైన ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేవలం తనకు అనుకూలంగా లేరని అధికారులను తొలగిస్తున్న జగన్ ప్రభుత్వానికి ఇది తగిన శాస్తి జరిగిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ అవమానం మాత్రం జగన్ ప్రభుత్వానికి ఎప్పటికి తొలగని మచ్చగా మిగలనుంది.

- Advertisement -

Related Posts

ఒక పక్క వ్యాక్సీన్ వేస్తుంటే – సడన్ గా భారీ ట్విస్ట్ ?

కరోనా వ్యాధికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. మొదట ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ముందుగా టీకాలు తీసుకునేవారితో మాట్లాడి.. నాలుగు మంచి మాటలు...

వాళ్ళంతా గౌతమ్ సవాంగ్ కే చుక్కలు చూపిస్తున్నారు .. బాబోయ్ ఇది పరాకాష్ట !

ఆంధ్రప్రదేశ్: ఆలయాల మీద జరిగిన దాడుల మీద శుక్రవారం నాడు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కుట్రల వెనుక ఎవరున్నారన్నది బయట పెట్టారు. ఈ దాడుల వెనుక...

“అన్నా …మీరే న్యాయం చెప్పండి” అంటూ ఏడ్చేసిన అఖిలప్రియ!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేసిన ఘటనలో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు కావటం.. ఆమె భర్తతో పాటు పలువురు అండర్ గ్రౌండ్ లో ఉండటం తెలిసిందే....

వెంకటేష్ నారప్ప రిలీజ్ ఎప్పుడు ..?

వెంకటేష్ నారప్ప సినిమా నుంచి అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్స్ అంతగా రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. రీమేక్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వెంకటేష్ మరోసారి తమిళ సూపర్ హిట్...

Latest News