టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఈ స్థానానికి చేరుకోవడానికి వ్యవస్థలను కూడా మేనేజ్ చేసేవారని రాజకీయ విశ్లేషకుల చెప్తున్నారు. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎన్నికల కమిషన్ ను సీబీఎన్ నడిపిస్తున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు.. అయితే ఈసారి స్థానిక ఎన్నికల విషయంలో జగన్ రెడ్డి మొదటిసారి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి నుండి కోర్ట్ ల నుండి ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నారు. కానీ మొదటి సారి స్థానిక ఎన్నికల విషయంలో జగన్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఎన్నికల కమిషన్ కు షాక్ ఇచ్చిన హై కోర్ట్
స్థానిక ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేని వైసీపీ ప్రభుత్వం హై కోర్ట్ ను ఆశ్రయించింది. ఎన్నికల షెడ్యూల్ ను వాయిదా వేస్తూ హై కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ఎన్నికల కమిషన్ చాలా షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత కోర్ట్ అడ్డుకున్న సందర్భాలు లేవు. మొదటిసారి ఇలా జరగడంతో ఎన్నికల కమిషన్ చాలా షాక్ లో ఉన్నారు. అలాగే స్థానిక ఎన్నికల నిర్ణయానికి సమ్మతం తెలిపిన చంద్రబాబు నాయుడు కూడా హై కోర్ట్ తీర్పుతో షాక్ లో ఉన్నారు.
నిమ్మగడ్డ ఎన్నికలను నిర్వహించలేరా!!
తాను పదవి విరమణ చేసే లోపు స్థానిక ఎన్నికలను నిర్వహించడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు మధ్య జరుగుతున్న ఈ గోడవలను చూస్తుంటే ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరిగేలా లేవు. చూస్తుంటే నిమ్మగడ్డ పదవి విరమణ చేసిన తరువాతే స్థానిక ఎన్నికలు జరిగేలా ఉన్నాయి.