రాజకీయ నాయకులకు ప్రజాసేవ కంటే ప్రజాధానంపై, ప్రజల యొక్క క్షేమం కంటే దాని వల్ల వచ్చే క్రెడిట్ పై ఎక్కువ ఆశ ఉంటుంది. రాజకీయ నాయకులకు క్రెడిట్ పిచ్చి ఉంటుంది. ఎంతలా అంటే దేశంలో ఎక్కడ ఏ మంచి పని జరిగినా కూడా అది తమ ఖాతాలోనే పడాలని ఆశగా గోతి కాడ నక్కలా చూస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు క్రెడిట్ పై ఉన్న శ్రద్ద ప్రజా సంక్షేమ పనులను చెయ్యడంలో అస్సలు ఉండదు. అయితే ఇప్పుడు ఏపీలో పోలవరం క్రెడిట్ ఎవ్వరికి రావాలని గోడవలు మొదలు అయ్యాయి.
వైసీపీ-బీజేపీ క్రెడిట్ రాజకీయాలు
ఏపీ రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్ట్ కేవలం ఒక రాజకీయ అంశంగానే మిగిలిపోయింది. ఎన్నికలకు ముందు మేమే పూర్తి చేస్తామంటే మేము చేస్తామని హామీలు ఇస్తారు తీరా అధికారంలోకి వచ్చిన తరువాత పొలవరాన్ని పక్కకు నెత్తుతారు. ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి నెలకొంది. పోలవరం చుట్టూ పెద్ద రాజకీయం జరుగుతుంది. పొలవరాన్ని ఎలాగైనా తమ హయాంలోనే పూర్తి చేసి క్రెడిట్ కొట్టేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంటే, ఎలాగైనా వైసీపీకి ఆ క్రెడిట్ ఇవ్వకూడదని కేంద్ర బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రెడిట్ గొడవల మధ్య పోలవరానికి సరైన నిధులు కూడా రావడం లేదు.
ఎవరి విగ్రహాలు పెట్టాలి??
పోలవరం ఇంకా పూర్తి కాలేదు కానీ అప్పుడే అక్కడ ఎవరి విగ్రహాలు పెట్టాలనే గొడవలు మొదలు అయ్యాయి. ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ నాయకులు కూడా రాజశేఖర్ రెడ్డి వల్లే పోలవరం ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఆయన విగ్రహం పెట్టాలనే ఆలోచనలో ఉండగా, బీజేపీ నాయకులు ఈ నిర్ణయానికి అడ్డుపడుతున్నారు. అక్కడ మాజీ ప్రధాని, బీజేపీ నేత వాజ్ పాయ్ విగ్రహం కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యకపోతే కేంద్ర నిధులతో తామే ఏర్పాటు చేస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని ఎలాగైనా అడ్డుకొని అక్కడ. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పెట్టడానికి జగన్ కృషి చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.