Y.S.Jagan: 2019 ఎన్నికలలో వైసీపీ సింగిల్ గా పోటీ చేసి ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించింది. ఇలా భారీ విజయాన్ని అందుకున్న వైఎస్ జగన్ 2024 ఎన్నికలలో కూడా 175 స్థానాలలో గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్లారు కానీ ఊహించని విధంగా ఈయనకు కేవలం 11 స్థానాలు మాత్రమే రావడం ఇప్పటికీ వైకాపా నేతలు జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి.
ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమిపాలు అయిన తర్వాత కూటమి పార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక కూటమి పార్టీలు కూడా అధికారంలోకి వచ్చి సుమారు 8 నెలలు అవుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈయన కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పర్యటిస్తూ వస్తున్నారు. ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తి అయ్యే వరకు వేచి ఉన్న జగన్ ఇప్పుడిప్పుడే తన రాజకీయ వ్యూహాలను అమలుపరుస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈయనకు అధికారం లేకపోవడంతో వారంలో మూడు రోజులు పాటు బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటున్నారు ఇక తాడేపల్లికి వచ్చిన తర్వాత ఈయన వివిధ జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సభలు సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల విజయవాడలోని వల్లభనేని వంశీని అరెస్టు చేయడంతో ఆయనని పరామర్శించడం కోసం జైలుకు వెళ్లి వచ్చారు అనంతరం గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి అక్కడ రైతులను పరామర్శించి వారి ఇబ్బందులను తెలుసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇక త్వరలోనే ఈయన జిల్లాల టూర్ కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇక జగన్ తిరిగి రాజకీయాలలో చాలా యాక్టివ్ అయ్యారని స్పష్టంగా అర్థమవతుంది అయితే జగన్ రాజకీయ ప్లాన్స్ ఏంటి అనేది తెలియదు కానీ మెల్లిమెల్లిగా తన వ్యూహాలన్నింటినీ అమలు పరుస్తూ వెళ్తున్నారని మాత్రం స్పష్టమవుతుంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అయితే ఈయనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తేనే వెళ్తానని లేకపోతే అక్కడికి వెళ్లి మౌనంగా ఉండలేనని చెప్పారు ఇలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జగన్ ఏదో ఒక కార్యక్రమం పేరిట జనాలలో తిరుగుతారని తెలుస్తోంది.