Y.S. Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటికీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు కావడంతో పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి అనంతరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ…
మన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికీ 15 సంవత్సరాలు అయింది మన పార్టీ ఆవిర్భవించిన రోజు కూడా మనం కష్టాలలో ఉన్నాము. మన పార్టీ పేదల కోసమే పుట్టుకొచ్చిందని తెలిపారు.అధికారంలో ఉన్నా.. లేకపోయినా తమ పార్టీ నిరుపేదల పక్షాల నిలబడుతోందని అన్నారు. నిత్యం ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తుందని తెలిపారు.. తమకు ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్తేమి కాదని కామెంట్ చేశారు.
మరో నాలుగేళ్లు గడిస్తే.. అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందు అడుగులు వేయాలని సూచించారు. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి జిల్లాలోని కలెక్టరేట్ ను ముట్టడించాలని జగన్ తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన, నిరుద్యోగ భృతి,హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని కార్యకర్తలు, నాయకులకు జగన్ పిలుపునిచ్చారు. ఇలా పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో భాగంగా పలువురు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కీలక నేతలు కూడా పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమంలో భాగంగా జగన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
