సీఎం జగన్‌ తిరుమల నుండి నేరుగా హైదరాబాద్ లోని ఆ ఆసుపత్రికి వెళ్ళింది ఇందుకా….

YS Jagan visited his uncle in continental hospital

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో జరిగిన ‘బ్రహ్మోత్సవం’ కార్యక్రమానికి హాజరై, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంకటేశ్వర స్వామికి ‘పట్టూ వస్త్రం’ (పట్టు వస్త్రాలు) ఇచ్చారు. గురువారం ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యడియరప్పతో కలిసి కోటి యాత్రికుల సముదాయం, తిరుమల వద్ద ఒక వివాహ మందిరం కోసం శంకుస్థాపన చేశారు.వీటిని రూ .200 కోట్లుతో నిర్మించబోతున్నారని సమాచారం.

YS Jagan visited his uncle in continental hospital
YS Jagan visited his uncle in continental hospital

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి భార్య భారతి తండ్రి అయిన గంగి రెడ్డి గారి ఆరోగ్యం సరిగా లేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ లోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శించేందుకు సీఎం జగన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లీ నుండి నేరుగా తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లిన జగన్‌ అక్కడ నిన్న రాత్రి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నిన్న రాత్రి అక్కడే బస చేసిన జగన్‌ నేడు ఉదయం కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి మరోసారి శ్రీవారిని దర్శించుకుని తిరుమలలో కన్నడ భక్తుల కోసం భవన నిర్మాణంకు శంకుస్థాపన చేశారు.

రేణు గుంట ఎయిర్‌ పోర్ట్‌ నుండి హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌ అక్కడ నుండి మామగారు అయిన గంగి రెడ్డిని పరామర్శించి అక్కడ కొద్ది సమయం ఉండి మళ్లీ మద్యాహ్నం గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్నారు.గంగి రెడ్డి గారి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన లేదు అంటూ ఇటీవలే కాంటినెంటల్‌ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన గత కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.