బ్రేకింగ్: కేసీఆర్ మాటలను ఖండిస్తూ జగన్ ప్రెస్ మీట్ 

YS Jagan to conduct press conference to give counter to KCR
రెండు తెలుగు రాష్ట్రాల నడుమ తలెత్తిన జలవివాదం సమసిపోకపోగా తీవ్ర రూపం దాల్చుతోంది.  ఏపీ నిర్మించతలపెట్టిన పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎలాంటి పని చేసినా సహించేది లేదని, అసలు ఆ ప్రాజెక్టుకు అపెక్స్ కమిటీ అనుమతులు లేవని కృష్ణా రివర్ యాజమాన్య బోర్డుకు తెలిపింది.  దీంతో వైఎస్ జగన్ సర్కార్ తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులన్నీ సరిగ్గానే ఉన్నాయా, రీడిజైన్లు చేసి ఇష్టానుసారం కడుతున్నారు అంటూ కాళేశ్వరం సహా పలు ప్రధాన ప్రాజెక్టుల మీద పిర్యాధులు లెవనెత్తింది.  దీంతో కేసీఆర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 
 
పోనీలే వివాదాలు ఎందుకని పిలిచి మరీ అన్నం పెట్టి బేసిన్లు లేవు భేషజాలు లేవు అంటూ రాజీకి పూనుకుంటే ఇప్పుడు తమ ప్రాజెక్టులనే అక్రమ ప్రాజెక్టులు అంటారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.  రాష్ట్రానికి రావలసిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, వృథాగా సముద్రంలోకి పోతున్న  నీటిని పంతా పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలుచేద్దామని చెప్పాను.   అయినా సరే ఏపీ ప్రభుత్వం కయ్యం పెట్టుకుంటోంది.  తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోంది. అపెక్స్‌ కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం నోరు మూయించేలా సమాధానం చెబుతాం.  తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఏపీ ప్రభుత్వానికి కల్పిస్తామని తేల్చి చెప్పారు.  
 
ఈమేరకు సంబంధిత శాఖలను వాదనలకు సన్నద్దం కావాలని ఆదేశించారు.  కేసీఆర్ మాటలపై వైఎస్ జగన్ కూడా బాగానే సీరియస్ అయ్యారట.  అపెక్స్ కమిటీ సమావేశంలో బలమైన వాదనలు వినిపించాలని డిసైడ్ అయ్యారట.  రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖతో సమావేశం నిర్వహించనున్నారు.  ఈ సమావేశానికి మంత్రి అనిల్ కుమార్, ఆ శాఖ కీలక అధికారులు హాజరుకానున్నారు.  ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వానికి తిరుగులేని సమాధానం ఇవ్వడానికి ఏం చేయాలి, కమిటీ ముందు తమ వాదనలు ఎలా ఉండాలి, నీటి కేటాయింపుల్లో తమ వాటాను స్పష్టంగా తెలపడం ఎలా అనే అంశాల మీద సమగ్ర చర్చ జరపనున్నారు.  ఈ చర్చ అనంతరం సీఎం ప్రెస్ మీట్ నిర్వహించి కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించే అవకాశం కూడా ఉంది.