మరి ‘టీమ్ మోడీ’ అంటే అలాగే ఉంటుంది.. తక్కువ అంచనా వేశారు జగన్ మీరు

political
క్రెడిట్ దక్కుతుంది అంటే ఏ రాజకీయ పార్టీ అయినా అందుకోవడానికి ముందు ఉంటుంది.  చేయని పనులకే ఘనత తీసుకోవాలని తాపత్రయపడే ఈరోజుల్లో ఇక చేసిన పనికి, ఆ పని ఫలితానికి కారణం మేమే అని చెప్పుకోకుండా ఉంటాయా.. ఎవరైనా ఆ క్రెడిట్ తన్నుకుపోవాలని అనుకుంటే చూస్తూ ఊరుకుంటాయ.  ఈ మాటలకే మంచి ఉదాహరణ అనేలా ఉంది వైసీపీ, బీజేపీ, టీడీపీల తీరు.  విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తికావొచ్చింది.  చిన్న చిన్న పనులు మినహా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంది.  దీంతో అధికార వైసీపీ ఈ ఫ్లైఓవర్ తమ హాయాంలోనే మొదలుకానుంది కాబట్టి ఆ క్రెడిట్ తమకే దక్కాలని భావించింది. 
political
 
అందుకు అనుగుణంగా కొన్ని నెలలుగా ఫ్లైఓవర్ నిర్మాణం తమ వలనే పూర్తైంది అంటూ సోషల్ మీడియాలో తమ బృందాల చేత ప్రచారం స్టార్ట్ చేసింది.  నిజానికి ఈ ఫ్లైఒవర్ ఘనత టీడీపీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దక్కాలి.  చాలా  ఏళ్ల క్రితమే కనకదుర్గ ఫ్లైఓవర్ మంజూరు కోసం విజయవాడ టీడీపీ నేతలు పోరాటం స్టార్ట్ చేశారు.  2014లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మరింత శ్రద్ద పెట్టి ఫ్లైఓవర్ అనుమతులు సాధించి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు.  టీడీపీ పాలనలో ఏకధాటిగా సాగిన పనులు కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి 85 శాతం ముగిశాయి.  మిగిలిన పనులు వైసీపీ పాలనలో జరిగాయి.  అవి కూడా ఆలస్యంగానే జరిగాయి. 
 
కానీ వైసీపీ మాత్రం అంతా తమ వలనే జరిగిందని ఊదరగొట్టడం స్టార్ట్ చేసింది.  దీంతో ఎంపీ కేశినేని ఇక ఊరుకుంటే లాభం లేదని నేరుగా వెళ్ళి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజయవాడవాసుల చిరకాల స్వప్నం కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి కావడానికి పూర్తి సహకారం అందించినందుకుగాను కృతఙ్ఞతలు చెప్పి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.  పనిలో పనిగా వైసీపీ వ్యవహారాన్ని కూడా వివరించారు.  నితిన్ గడ్కరీ చాలా ఖచ్చితమైన వ్యక్తి.  ఇలాంటి చర్యలను అస్సలు సహించరు.  అందుకే విషయం తెలియగానే టీడీపీతో ఉన్న వైరాన్ని సైతం పక్కనపెట్టి ప్రారంభోత్సవంలో నేరుగా లేదా ఆన్ లైన్ ద్వారా పాల్గొంటానని మాటిచ్చారు.  దీంతో ఇక వైసీపీకి ప్రారంభోత్సవం రోజున అంతా తమదేనని చెప్పుకునే వీలు ఉండదు.  ఎందుకంటే గడ్కరీ లైన్లో ఉంటారు మరి.