వైసీపీలో ఉన్న కీలకమైన నాయకుల్లో పేర్ని నాని ఒకరు. ఆయనకు వైసీపీలోను, సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి పేర్ని నానిపై హత్య యత్నం జరిగింది. ఈ ఘటన నుండి పేర్ని నాని సురరక్షితంగా బయటపడ్డారు. ఎందుకు చేశారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కృష్ణ జిల్లా, మచిలీపట్నంకు చెందిన పేర్ని నానిపై హత్య యత్నం జరగడం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
తాపీతో నానిపై దాడి
ఆదివారం పేర్ని నాని నియోజక వర్గ ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. వారిలో చెమ్మన్నగిరిపేటకు చెందిన బడుగు నాగేశ్వర రావు కూడా వచ్చారు. ఆయన పేర్ని దగ్గరకు కాళ్ళ మీద పడటానికి వెళ్లి తాపితో పేర్ని నానిని పొడవడానికి ప్రయత్నించారు. కానీ నాని తప్పించుకునున్నారు. అయితే నాగేశ్వర రావు మళ్ళీ పొడవడానికి ప్రయత్నించారు. అప్పుడు నాని అనుచరులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జరిగినప్పుడు నాగేశ్వర రావు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎందుకు చేశాడన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
మొదట అనుచరుడు, ఇప్పుడు యజమాని
ఈ హత్యా ప్రయత్నం నాగేశ్వర రావు మద్యం మత్తులో చేశారా లేకా ఎవరైనా చేయిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం పేర్ని నాని అనుచరుడు మేకా భాస్కర రావు హత్య గురి అయ్యాడు. ఇప్పుడు ఇలా పేర్ని నానిపై దాడి జరగడంతో పోలీసులు పూర్తి స్థాయిలో విచారన చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నానికి ఫోన్ చేసి సమాచారం తెల్సుకున్నారని, ఈ దాడి వెనక ఉన్న వారిని వీలైన్నంత తొందరగా పట్టుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.