సీక్రెట్ సర్వేలో జగన్‌కు అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యేలు

ysrcp

వైఎస్ జగన్ ఇదివరకటిలా లేరు.  పార్టీలో జరుగుతున్న ప్రతి వ్యవహారాన్ని గమనిస్తూనే ఉన్నారు.  దీంతో కొందరు ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి దొరికారని, వారి మీద సీఎం గట్టిగానే రియాక్ట్ అయ్యారని రాజకీయ వర్గాల్లో హాట్ గాసిప్స్ వినబడుతున్నాయి.  అధికారం చేపట్టిన మొదటి యేడాది వైఎస్ జగన్ పార్టీలోని ఎమ్మెల్యేల వైపు అస్సలు చూడలేదు.  తన చుట్టూ ఉన్న విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన, బొత్స సత్యనారాయణ లాంటి కొందరు ముఖ్యమైన నేతలతో మాత్రమే ఆయన సంప్రదింపులు ఉండేవి.  అసలు గెలిచిన వారిలో సగం మంది ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ దొరకలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.  ఈ పరిణామం కొందరు లీడర్లకు కోపం, అసహనం తెప్పిస్తే ఇంకొందరికి మాత్రం అవకాశంలా ఉపయోగపడింది. 

 

ఎలాగూ అధినేత గమనించడం లేదు, అధికారం చేతిలో ఉండటంతో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టానుసారం తయారయ్యారు.  వారి మూలాన  కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయం దెబ్బతింది.  నేతల మద్య గ్రూప్ వార్స్ మొదలయ్యాయి.  ఇక కొందరు ఎమ్మెల్యేలు అయితే కనీస బాధ్యతలను కూడా నిర్వర్తించడం లేదట.  గత యేడాదిన్నర కాలంలో సంక్షేమ పథకాల అమలు, ప్రజలతో మమేకమవ్వడం, వారి కష్టాలను, అవసరాలను తెలుసుకోవడం, ప్రభుత్వాన్ని వారికి దగ్గరగా తీసుకెళ్లడం లాంటి పనులేవీ సదరు ఎమ్మెల్యేలు చేయడం లేదట.  ఇంకొందరైతే ఏకంగా కమీషన్లకు అలవాటుపడి జనాన్ని ఇబ్బందిపెడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని ముఖ్యమంత్రికి ఉప్పందింది.  

ఈ ఉప్పు ఊరికే అందలేదు.  గత కొన్ని నెలలుగా జగన్ ఇక సంస్థ ద్వారా పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వే చేయించారట.  మూడవ కంటికి తెలియకుండా జరిగిన ఈ సర్వేలోనే క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేల వ్యవహారం బయటపడింది.  వీరి మూలంగా అయా నియోజకవర్గాల్లో ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతింది.  తానేమో వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలుచేయడం, మూడు రాజధానులు, ఇంగ్లీష్ మీడియం విద్య, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ లాంటి పనులతో పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేయడానికి కష్టపడుతుంటే కొందరు ఎమ్మెల్యేల నిర్లక్ష్యం, అత్యాశ కారణంగా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోందని జగన్ అగ్రహించారట.  అంతే నేరుగా ఆ ఎమ్మెల్యేలను లైన్లోకి తీసుకుని వారి తప్పులను వారికి గుర్తుచేసి ఇకపై పద్దతి మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని తెగేసి చెప్పారట.  మరి ముఖ్యమంత్రి వార్నింగ్ అందుకున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరో స్పష్టంగా తెలియడం లేదు కానీ ఇకనైనా వారు మారితే మంచిది.