AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలను ఒక్కొక్కటిగా అమలుపరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి ఎంతోమంది బయటకు వెళ్లిపోయారు అయినప్పటికీ కూడా ఈయన ఏమాత్రం నిరాశ చెందకుండా తిరిగి తన పార్టీని నిలబెట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. మరోవైపు కూటమి పార్టీలు సైతం వైసీపీని అనగదొక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి ఎల్పీ సమావేశంలో భాగంగా పార్టీ నేతలకు కొన్ని సూచనలు చేశారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ గురించి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని ఎవరు కూడా తక్కువ అంచనా తెలిపారు. 2019వ సంవత్సరంలో ఈయన వివేకానంద రెడ్డి హత్య కేసును చాలా సునాయసంగా మనమేడకు చుట్టారని, నాడు నిఘా వ్యవస్థ సైతం ఆ కుట్ర ఛేదించలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అలాంటి వ్యక్తితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు తెలిపారు.
ఇక ఎవరు కూడా అనవసర విషయాల జోలికి వెళ్లకూడదని ఈయన తెలిపారు. చంద్రబాబు. కొందరు నేతల తీరు అభ్యంతరకరంగా ఉందని.. అటువంటి వారి వివరాలను తెప్పించుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల తీరు ఏ మాత్రం బాగాలేదని చంద్రబాబు నాయుడు తనదైన శైలిలోనే నేతలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇకపోతే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది పండుగ తర్వాత జనంలోకి రాబోతున్నారు నియోజకవర్గం వారిగా ఈయన ప్రతి జిల్లాలోనూ మూడు రోజుల పాటు పర్యటన చేస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యేల పనితీరు గురించి ఆయన ప్రస్తావించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముందుగానే తన ఎమ్మెల్యేలకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు తెలుస్తుంది.
