అమెరికా అధ్యక్షుడు ట్రంప్- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తలపిస్తున్నారా? వరాలు ప్రకటించడంలో జగన్ మోహన్ రెడ్డినే..డొనాల్డ్ ట్రంప్ కొట్టేసాలా? ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. అవును ఏపీ సీఎంలాగే ట్రంప్ కూడా మాట తప్పను..మడమ తిప్పను అన్న వాగ్ధానాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏపీలో సుభిక్ష పాలన అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్కొక్క పథకాన్ని అమలు పరుచుకుంటూ వస్తున్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాకానుక, వాహన మిత్ర, మహిళా సంక్షేమాలు అంటూ జగన్ పథకాల సునామీ కొనసాగుతోంది.
అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు చకచకా జరుగుతోంది. వాటిలో కొన్ని జిల్లాలకు స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు, ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు పెట్టడానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. సరిగ్గా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో జగన్ ని ఫాలో అయిపోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలోని ప్రవాసాంధ్రులకు ట్రంప్ చేస్తోన్న కొన్ని ప్రకటనలు, పనులు చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డే గుర్తొస్తున్నారని అంటున్నారు. న్యాయార్క్, డెకాయిట్, ఇల్లినాయిస్, నార్త్ అమెరికా వంటి చాలా రాష్ర్టాల్లో తెలుగు సంఘాలు ఉన్నాయి. వాళ్లంతా ఎప్పటికప్పుడు తెలుగు రాష్ర్టాల రాజకీయాలను పరిశీలిస్తునే ఉంటారు.
ఉద్యోగాలు అమెరికా లో చేస్తున్నప్పటికీ మనసంతా సొంత ఊరు, జిల్లాపై ఉండక మానదు కదా. అలా రాజకీయంగా ట్రంప్ -ని , జగన్ మోహన్ రెడ్డి నికంపారిజన్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా రిపబ్లికన్లు-డెమొక్రాట్లు హోరా హోరి గా బరిలోకి దిగుతున్నారు. దీనిలో భాగంగా ట్రంప్ ఓటర్లను ఆకర్షించుకునేందుకు తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తూనే తనదైన శైలిలో వరాల జల్లు కురిపిస్తున్నారు.హెల్త్ ఇన్సురెన్స్ , ఫుడ్ స్టంట్స్, నిరుద్యోగులకు స్టయిఫెండ్, పన్ను రాయితీలు కల్పిస్తానని మాటిచ్చారు ట్రంప్. 2016 ఎన్నికల సమయంలోనూ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వాగ్ధానాలే చేసారు. కానీ ఏవి నెర వేర్చలేదు. మెక్సికోకి గోడ కడతానని, దేశ పౌరులకే ఉద్యోగాలని, విదశీయులను అడ్డుకుంటానని మాటిచ్చారు. కానీ ఆయన వీటిలో పెద్దగా పురోగతి సాధించలేదు. తాజాగా మళ్లీ పాత పాటే పాడుతూ..ఆ పాటకి జగన్ మోహన్ రెడ్డి తరహాలో సంక్షేమాల ట్యాన్ కట్టారంతే.