రాయలసీమ లోని జగన్ శత్రువులకి ఆఖరి శుభం కార్డ్ ?

JC Diwakar Reddy sensational comments over YS Jagan

2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం వైసీపీని బలపరిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వైసీపీ టీడీపీని పూర్తిగా నాశనం చేసి పూర్తిగా పార్టీని బలపరిచింది. అయితే ఇలాంటి నేపథ్యంలో రాయలసీమలో వైసీపీని మరింత పటిష్టం చెయ్యడానికి వైసీపీ శత్రువుల మీద జగన్ పతకం రచించారు. ఈ పతకాన్ని పక్కాగా వైసీపీ నాయకులు అమలు చేస్తున్నారు.

100 cr fine to jc diwakar reddy on illegal mining
100 cr fine to jc diwakar reddy on illegal mining

వైసీపీకి చిక్కిన జేసీ బ్రదర్స్ అక్రమాలు

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ బ్రదర్స్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైస్ జగన్ పై విపరీతంగా విమర్శలు చేస్తూ, ఆరోపణలు చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు వైసీపీని అధికారంలోకి వచ్చింది కాబట్టి వైసీపీ నాయకులు కూడా టీడీపీ లాగే కక్ష్యపూరిత రాజకీయాలు మొదలు పెట్టారు. అనంతపురం జిల్లాలో రాజకీయాలను ఏలిన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలకు ఇప్పుడు వైసీపీ నుండి ఇబ్బందులు మొదలు అయ్యాయి. దివాకర్ రెడ్డి, ఆయనకు కొడుకు ఇప్పటికే పలు కేసులు విషయంలో జైలు కూడా వెళ్లారు. అలాగే ఇప్పుడు దివాకర్ రెడ్డిపై కూడా దొలమైట్ సున్నపురాయి మైనింగ్ కు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని, గణుల శాఖ అధికారులు రూ. 100కోట్ల జరిమానా విధించారు. ఒకవేళ ఇచ్చిన గదువులోపు జేసీ దివాకర్ రెడ్డి జరిమానా చెల్లించకపోతే అధికారులు ఆస్తులను జప్తు చేస్తారని సమాచారం.

జేసీ పతనం మొదలైందా!!

ఇప్పటికే జేసీ బ్రదర్స్ కి చెందిన అనేక వ్యాపారాలను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఇప్పటికే జేసీ బ్రదర్స్ కు సంబంధించిన ట్రావెల్స్ వ్యాపారాన్ని వైసీపీ పూర్తిగా దెబ్బతీసింది. అలాగే ఇప్పుడు అక్రమ మైనింగ్ విషయంలో జేసీ బ్రదర్స్ ను పూర్తిగా పతనం చెయ్యడానికి వైసీపీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. రూ. 100 జరిమానా కట్టకపోతే ఇప్పటికే ఆస్తిని కూడా అధికారులు జప్తు చేయనున్నారు. అలాగే రాజకీయంగా కూడా జేసీ బ్రదర్స్ యొక్క బలం కూడా తగ్గిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రానున్న రోజుల్లో వైసీపీ నుండి జేసీ బబ్రదర్స్ ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో వేచి చూడాలి.