ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ నాయకులు మధ్య మాటల యుద్ధం మాములుగా జరగడం లేదు. ఇరుపార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ చిన్న సైజ్ యుద్ధాన్ని ప్రజలకు చూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీపై, టీడీపీకి మద్దతు ఇస్తున్న మీడియా ప్రతినిధులపై పెద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేరుగా వైసీపీ ఎదుర్కొనే దమ్ము లేకపోవడం వల్లే ఇలా మీడియా తన ప్రభుత్వాన్ని, పాలనపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, ఏబీఎన్, టీవీ5, ఈనాడు లాంటి మీడియా సంస్థలను అడ్డుపెట్టుకొని ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాళ్లకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అస్సలు కనిపించవని, కేవలం జగన్ జైలు వెళ్లిన దృశ్యాలు మాత్రమే కనిపిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఈనాడు పత్రికపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు యాక్టర్ అయితే ఏబీఎన్, టీవీ5,ఈనాడు లు డైరెక్షన్ చేస్తున్నాయని జగన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఈ మీడియా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు.
అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా అనుకూల మీడియాగా సాక్షి పత్రిక, ఛానల్ ఉందని, వాళ్లకు కూడా పాలన విషయంలో వాళ్ళకు కూడా జగన్ చేసిన తప్పులు కనిపించవని, కేవలం జగన్ ను పొగడటం మాత్రమే తెలుసని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.