వైసీపీ పార్టీలోని నాయకులు అధికారంలోకి రాకముందే బాగా కలిసి ఉన్నారు. అయితే ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీలో గొడవలు మొదలు అయ్యాయి. ఆ గొడవలు ఎంతలా అంటే ప్రజా వేడుకల్లో కూడా నేరుగా తిట్టుకొని, కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. మొదట్లో వేరే పార్టీల నుండి వైసీపీలోకి వచ్చిన వారితో గొడవలు జరుగుతూ ఉండేవి అయితే ఇప్పుడు సొంత నేతలతోనే గోడవలను అవుతున్నాయి. ఇలా గొడవలు పడటం పార్టీకి మంచిది కాదని భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొడవలు పడుతున్న నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి, పిల్లి సుభాష్‌కు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారని సమాచారం .
ద్వారంపూడి-సుభాష్ కు క్లాస్ తీసుకున్న జగన్
ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలపై వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, అదే పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ఘర్షణ పడటం, బూతులు తిట్టుకోవడం సంచలనం రేపింది.ఈ వ్యవహారంపై పార్టీ అధినేత, సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలను తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని, క్లాస్ పీకారు. బహిరంగ వేదికలపై పరస్పరం విమర్శలు చేసుకోవద్దని సీఎం హితవు పలికారు. దీంతో సెట్ రైట్ అయిన ఇరువురు నేతలు ఇప్పుడు జిల్లా వేదికగా ఒకే చోటకు చేరి ఐక్యతను ప్రదర్శించారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి ఆహ్వానించారు.
అంతర్గత గోడవలపై దృష్టి పెట్టిన జగన్
వైసీపీ అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడ్డారు. దాదాపు 10 సంవత్సరాలు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం జగన్ కష్టాన్ని పట్టించుకోకుండా గొడవలు పడుతూ వైసీపీకి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇలా పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న నేతలతోపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాంటి నేతలను తన ఆఫీస్ కు పిలిపించుకొని మరీ క్లాస్ పికుతున్నారు. పార్టీకి చెడ్డపేరు తెస్తున్న నేతలపై కనికరం చూపించడం జరగదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకేతం ఇస్తున్నారు.