రాజకీయాల్లో లోకల్ నాయకులు కేంద్ర ప్రభుత్వంను ఎదురించడానికి సహజంగానే భయపడతారు కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఎలాంటి అధికారం లేన్నప్పుడే యూపీఏ సర్కార్ ను, సోనియా గాంధీని ఎదురించారు. తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం వల్ల జైలు పాలు కూడా అయ్యారు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా అయ్యాక సోనియా గాంధీకి ఒక రకంగా చిన్న షాక్ ఇచ్చారు.
మోడీ తరువాత జగనే
సోషల్ మీడియాలో పీఎం నరేంద్ర మోడీని బీట్ చెయ్యడం ఎవ్వరికి సాధ్యం కాదు. ఆయన సోషల్ మీడియాఛాంపియన్ గా ఉంటారు. దేశంలో దాదాపు ఏ నాయకుడు కూడా సోషల్ మీడియా వాడకంలో మోడీకి పోటీ ఇవ్వలేరు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు మోడీకి సోషల్ మీడియాలో పోటీ ఇస్తున్నారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్ సంస్థ అధ్యయనం చేసి ఓ నివేదిక వెలువరించింది. ఈ మూడు నెలల్లో దేశంలో 95 మంది టాప్ పొలిటికల్ లీడర్లు, 500 మంది అత్యున్నత ప్రభావితం చేయగల వ్యక్తులకు సంబంధించి వివిధ సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్స్‌ను ఆ సంస్థ విశ్లేషించిందని చెబుతున్నారు.
సోనియాను దాటేసిన జగన్
ఈ స్టడీ దేశంలోనే మోడీ తరువాత ట్రేండింగ్ లో ఉన్న నాయకుల్లో జగన్ రెండవ స్థానంలో ఉన్నారు. కానీ ఇక్కడే జగన్ సోనియా గాంధీకి షాక్ ఇచ్చారు. ఈ స్టడీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరువాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు. జగన్ కేవలం ఏపీకే సీఎం కానీ సోనియా, రాహుల్ మాత్రం దేశం మొత్తం కీలక రాజకీయాలు చేసిన పార్టీకి చెందిన నాయకులు. అయినా కూడా జగన్ వాళ్లను దాటుకుని సోషల్ మీడియాలో తన హవాను చూపిస్తున్నారు.