Y.S Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం అయినటువంటి విజయసాయిరెడ్డి ఊహించని విధంగా రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలలో అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఉందని అందుకే ఆయన రాజీనామా చేశారు అంటూ ఎంతో మంది ఈయన రాజీనామా పై పెద్ద ఎత్తున చర్చలు జరిపారు.
ఇక విజయ సాయి రెడ్డి కూడా తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి పార్టీలలోకి చేరనని తాను పూర్తిగా రాజకీయాలకు రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. ఇకపై తాను వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి తన రాజీనామాని ప్రకటించారు. అయితే జగన్మోహన్ రెడ్డికి చెప్పేతాను రాజీనామా చేస్తున్నానని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
ఇకపోతే నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు ఎంపీ విజయ సాయిరెడ్డి రాజీనామా గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి రాజకీయాలకు రాజీనామా చేయడం గురించి మాట్లాడుతూ… మాకు 11మంది రాజ్యసభ ఎంపీలు ఉంటే ఇప్పటివరకు ముగ్గురు వెళ్లిపోయారు విజయసాయిరెడ్డితో కలిసి నలుగురు వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఏమి కాదని తెలిపారు.
రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యము అంటూ జగన్ తెలిపారు. అది సాయి రెడ్డి కైనా ఇప్పటివరకు వెళ్లిపోయిన వారికైనా లేదా రేపో మాపో ఇంకో ఒకడో ఇద్దరూ వెళ్లే వారికైనా అదే వర్తిస్తుంది. వారి క్యారెక్టర్ ను బట్టి ఉంటుంది. ఈ వైసీపీ పార్టీ అనేది దేవుడి దయ ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుంది అంటూ ఈ సందర్భంగా జగన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.