సుప్రీం కోర్టు లో ఎక్కడ తప్పు చేయకూడదో.. జగన్ లాయర్ అక్కడే తప్పు చేశాడు??

AP government

Central government spoils YS Jagan's english medium plans
రాష్ట్రంలోని రాజకీయాలు అన్ని అమరావతి చుట్టూ తిరుగుతుంది. ప్రతిరోజు ఒక్కో ట్విస్ట్ తిరుగుతుంది. అమరావతి కోసం ప్రతిపక్షాలు, రైతులు పోరాడుతుండగా, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అమలు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని రైతులు పోరాడుతున్న తరుణంలో వైసీపీప్రభుత్వం మూడు రాజధానుల అనుమతికి గవర్నర్ అనుమతి తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై హై కోర్ట్ లో ప్రజావ్యాజ్యాలు దాఖలు కావడం వల్ల హై కోర్ట్ మూడు రాజధానుల బిల్లుపై స్టేటస్ కో విధించింది. ఈ నిర్ణయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టుకి వెళ్లిన విషయం విషయం తెలిసిందే. విచారణ తొందరగా చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం లేఖ కూడా రాశారు.

సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్న ఏపీ ప్రభుత్వ న్యాయ నిపుణులు తప్పుల తడకలుగా వేయడంతో.. ఆ పిటిషన్ వెనక్కి వచ్చింది. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన ధర్మాసనం పేర్లు తప్పుగా రాశారు. అలాగే..ఇచ్చిన ఉత్తర్వులేమిటో.. పిటిషన్‌కు జత చేయలేదు. దీంతో తప్పులు సరిదిద్దుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. సోమవారమే విచారణకు వస్తుందని ఆశపడిన ఏపీ సర్కార్‌కు సోమవారం విచారణకు రాలేదు. దాంతో అర్జంట్‌గా విచారించాలంటూ.. మరో అప్లికేషన్ పెట్టారు. ఈ తరుణంలో పిటిషన్‌లో తప్పులు బయటపడ్డాయి.

ఇప్పుడు ఏపీ సర్కార్ పని రెంటికి చెడ్డ రేవడి అయినట్లయింది. ఓ వైపు హైకోర్టులో 14వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టులోనూ మళ్లీ పిటిషన్ వేయాల్సి ఉంది. రెండు కోర్టుల్లోనూ సమాంతరంగా విచారణ జరిగే అవకాశం లేదు. దీంతో శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.అయితే జగన్ ఇవ్వన్నీ పట్టించుకోకుండా శంకుస్థాపన చేయనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ కు ఉన్న క్లారిటీ ఆఫ్ థాట్ తన న్యాయ నిపుణులకు లేకపోవడం జరిగిన తప్పులే మళ్ళీ, మళ్ళీ జరుగుతున్నాయి.