చంద్రబాబును దెబ్బతియ్యడానికి జగన్ వేసిన వ్యూహాన్ని వైసీపీ నేతనే అడ్డుకుంటున్నాడా ??

2019 ఎన్నికల్లో టీడీపీని చాలా ఘోరంగా వైసీపీ దెబ్బకొట్టింది. ఇప్పటికే అనేకమంది టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీలోకి వెళ్లారు. కానీ జగన్ కోరిక ఇంకా తీరలేదు. టీడీపీని పూర్తిగా దెబ్బకొట్టడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జిల్లా అయిన చిత్తూరు జిల్లాపై ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నువేశారు. అక్కడ ఉన్న ప్రజల చేత కూడా జగన్మోహన్ రెడ్డి మెప్పును పొందటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్ పతాకాన్ని వైసీపీ నేతలే అడ్డుపడుతున్నారు.

jagan and cbn telugu rajyam
jagan and cbn telugu rajyam

జగన్ వ్యూహానికి అడ్డుపడుతున్న వైసీపీ నేత ఎవరు ?

చిత్తూరు విష‌యానికి వ‌స్తే.. ఇక్కడ ప్రధాన‌ ప్రతిప‌క్షం చంద్రబాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పం కూడా ఉంది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ పాగా వేయాల‌నేది ఎప్పటి నుంచో ఉన్న వ్యూహ‌మే. మ‌రీ ముఖ్యంగా చంద్రబాబును ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఓడించి.. వైసీపీ గెలుపు గుర్రం ఎక్కేలా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక‌ కుప్పంను మినీ మునిసిపాలిటీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇలా అనేక పనులను చేస్తూ చిత్తూరు ప్రజల మద్దతును పొందటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలకు చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, వైసీపీ ఎంపీ అడ్డుపడుతున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. ప్రతి అభివృద్ధి పనిలోనూ డబ్బుకోసం ఆశపడుతూ పనులను ముందుకు సాగనివ్వడం లేదని, అలాగే మిగితా వైసీపీ నాయకులకు ఎలాంటి పనులు ఇవ్వకుండా అన్నింటిలో తానే దూరుతూ వైసీపీ నేతలకు కూడా ఇబ్బందులు తెస్తున్నారు. కుప్పంలో బాబును ఓడించి టీడీపీని భూస్థాపితం చెయ్యడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే ఈ ఎంపీ మాత్రం డబ్బుకు ఆశపడుతూ జగన్ వ్యూహానికి అడ్డుపడుతున్నారు.

కుప్పంలో బాబును జగన్ ఓడించగలడా!!

కుప్పం టీడీపీకి కంచుకోట లాంటిది. అక్కడ వేరే పార్టీ నేతలు ప్రవేశించడం అంత సులభం కాదు. కానీ ఇప్పుడు వైసీపీ అక్కడ ప్రవేశించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తుంది. అలాగే చాలామంది టీడీపీ నేతలను వైసీపీ తీసుకోవడానికి కూడా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చాలా టీడీపీ కంచుకోటలలోకి జగన్ ప్రవేశించారు, అయితే కుప్పంలో మాత్రం బాబును ఓడించలేకపోయారు. కానీ కుప్పంలో కూడా ఎన్నికల సమయంలో వైసీపీ బాబుకు గట్టి పోటీ ఇచ్చింది కానీ అక్కడ చివరికి బాబుకు దాసోహం అయ్యారు. కానీ ఇప్పుడు అక్కడ వైసీపీ చేస్తున్న అభివృద్ధి పనులు, ప్రవేశపెడుతున్న పథకాలు, చేస్తున్న రాజకీయ వ్యూహాలు రానున్న రోజుల్లో చిత్తూరులో కూడా వైసీపీ టీడీపీకి గట్టి పోటీ ఇవ్వనుంది.