ఎందుకు వై ఎస్ జగన్ తెల్లారిన దగ్గర నుంచీ ఆ ‘ 900 ఎకరాలు ‘ మీదే దృష్టి పెట్టాడు ?

Ys Jagan

ఏపీ రాజకీయాలు అన్ని రాజధాని చుట్టే తిరుగుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. ఎందుకంటే ఏపీలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు నోరు తెరిస్తే మాట్లాడే మొదటి మాట, ఆఖరి మాట రాజధానై ఉంటుంది. ఏపీ నాయకులు అసలు అభివృద్ధి గురించి మాట్లాడటం మర్చిపోయారు. పార్టీ కార్యకర్తలు నుండి పార్టీ నాయకుల వరకు ప్రతి ఒక్కరు రాజధాని గురించే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కొత్త మార్గంలో రాజధానిపై విరుచుకుపడబోతున్నారు. అమరావతిలో టీడీపీలో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఆ 900ల ఎకరాలపై జగన్ ప్రత్యేక శ్రద్ద

అమరావతిలో టీడీపీ నాయకులు, చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను బయటపెట్టడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అయితే ఇప్పుడు జగన్ చంద్రబాబు మోసలతోనే రైతుల మనసుల్లో నిలిచిపోనున్నాడు. మొత్తంగా 4075 ఎకరాల భూమి టీడీపీ నేతలు, వాళ్ల బినామీల చేతుల్లో ఉన్నట్టు, వీటిలో 900 ఎకరాల అసైన్డ్ భూముల్ని దళితుల నుంచి లాక్కున్నట్టు వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వం రైతుల నుండి టీడీపీ నేతలు లాక్కునట్టు భావిస్తున్న భూములను మళ్ళీ తిరిగి రైతులకే ఇప్పించి పనిని త్వరలో ప్రారంభించనుంది. ఇలా రైతుల భూములను తిరిగి ఇప్పిస్తే జగన్ వాళ్ళ దృష్టిలో దేవుడిలా నిలిచిపోతారు. అలాగే రైతుల పట్ల టీడీపీ నేతలు, చంద్రబాబు నాయుడు చేసిన కుట్రను కూడా బయటపెట్టి టీడీపీని శాశ్వతంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.

అమరావతి రైతులతో చర్చలా!

900 ఎకరాల అసైన్డ్ భూముల్ని దళితుల రైతులకు ఇప్పించి ప్రయత్నం చేస్తున్న వైస్సాపీ ప్రభుత్వం మరో పథకానికి కూడా శ్రీకారం చుట్టింది. అదేంటంటే అమరావతి రైతులతో కూడా చర్చలు జరిపి వాళ్లకు కూడా న్యాయం చేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇలా చేసి రైతులకు న్యాయం చేస్తే ఏపీలో జగన్ కొట్టే నాయకుడే ఉండడు. రైతుల పాలిట జగన్ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా రైతుల మనసులో నిలిచిపోతారు.