వల్లభనేని అత్యుత్సాహం జగన్ ని కరక్ట్ పాయింట్ లో ఇరిక్కుపోయేలా చేసింది..!

YS Jagan ready for a fight with High court

ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు ఎన్ని పార్టీలైన మారతారు, అలా మారడం ఈ రోజుల్లో చాలా సహజం.అయితే కొంతమంది నాయకులు గెలిచిన తరువాత కూడా అధికార పార్టీలోకి మారుతూ ఉంటారు. అలా వెళ్తున్న వారిలో వల్లనేని వంశీ మోహన్ కూడా ఒకరు. తెలుగుదేశం నుండి గెలిచిన వంశీ తరువాత కాలంలో టీడీపీకి రెబల్ గా మారి, వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వైసీపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా వంశీ ఉన్నారు. కానీ వైసీపీలోకి వెళ్లాలంటే వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది.
వల్లభనేని వంశీమోహన్
మళ్ళీ గెలుపుపై నమ్మకం లేని వంశీ అంత సాహసం చేయడం లేదు. కానీ జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ, చంద్రబాబును, టీడీపీ ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. అయితే తాజాగా మోహన్ చేసిన పని జగన్ ను ఇరకాటంలో పెట్టేసింది.

ఒక్కసారిగా ఇప్పుడు వంశీ మోహన్ గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఇంచార్జినని స్వయంగా ప్రకటన చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అధికారికంగా వైసీపీలోకి ఇంకా ప్రవేశించని వంశీ ఇలా ప్రకటించడానికి కారణం ఉందట. వైసీపీకి క్యాడర్ సపోర్ట్ ఇవ్వడం లేదు. టిడిపిలో ఉన్నప్పటి నుండి ఆయనతో పాటు ఉన్న వారితోనే కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇక అప్పటి నుండి వైసీపీకి ఉన్న క్యాడర్ అంతా దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వెనుక ఉన్నారు. ఇప్పుడు వీరు ఇరువురు ఎవరి రాజకీయాల వారు చేసుకుంటున్నారు, దుట్టా రామచంద్ర రావు అల్లుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు. ఆయన గన్నవరం సీటు కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. తను వైఎస్ కుటుంబానికి చెందినవాడిని అని చెబుతూ అధికారులతోనూ పనులు చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. దుట్టా కాని, యార్లగడ్డ కానీ వల్లభనేని తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. వైసీపీ నేతలు, కార్యకర్తలు తన కోసం పని సచేయాలనే సంకేతం పంపడానికే ఈ వ్యాఖ్యలు చేశారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే ఇంకా వైసీపీలోకి రాకముందే వంశీ అలా ఎలా ప్రకటిస్తాడాని స్థానిక వైసీపీ నేతలు జగన్ ను ప్రశ్నిస్తున్నారు. వంశీ పార్టీలోకి రావాలంటే ముందు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి, అందులో గెలిచి , అప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని వైసీపీ నేతలు చెప్తున్నారు. అత్యుత్సాహంతో వంశీ చేసిన వ్యాఖ్యలు జగన్ ను ఇరకాటంలో పెట్టాయి. సొంత నేతల నుండి కూడా ప్రశ్నలు జగన్ ప్రశ్నలు ఎదుర్కోవాలసి వస్తుంది. ఈ ప్రశ్నలకు రానున్న రోజుల్లో జగన్ ఎలా సమాధానం చెప్తారో వేచి చూడాలి.