2019 ఎన్నికల్లో చాలా మంది విశ్లేషకులు, రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారం చేపడుతుందని భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలు సాధించి రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని ఒక విజయాన్ని నమోదు చేసింది. ఈ పరాజయం నుంచి కోలుకోవడానికి ప్రతిపక్షాలకు ఒక ఆరు నెలలు సమయం పట్టింది. తిరిగి ప్రతిపక్షాలు రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ అయినప్పటి నుండి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రతిష్టపాలు చేయాలని అనే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఎప్పుడైతే వైయస్ జగన్ ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణ ప్రతిపాదన చేశారో అప్పటినుండి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని కమ్మ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. అయితే రాష్ట్ర జనాభాలో కేవలం ఆరు ఏడు శాతానికి మించని కమ్మ సామాజిక వర్గానికి అనుకూలంగా చేసే రాజకీయాలకు మిగతా వర్గాల నుండి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి మద్దతు లభించలేదు. దాంతో ఈ కుల వివాదం లబ్ది చేకూర్చదని నిర్ణయించుకున్న తెలుగుదేశం అదును కోసం వేచి చూస్తూ వచ్చింది.
ఇన్నాళ్లకు తిరుమల బ్రహ్మోత్సవాల రూపంలో తెలుగుదేశానికి, కొత్తగా అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ, జనసేన కూటమి కూటమికి ” డిక్లరేషన్ ” అనే ఒక ఆయుధం దొరికింది. దీనికి మునుపు కూడా ప్రతిపక్షాలన్నీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారాలు ఎక్కువయ్యాయని, హిందువులని క్రైస్తవులుగా మత మార్పిడి చేయడానికి ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపణలు చేసేవారు. ఈ నేపథ్యంలో ” డిక్లరేషన్” ని ఒక పెద్ద రాద్ధాంతం చేచేయాలని చూసిన ప్రతిపక్షాలకు వైయస్ జగన్ తాను ఏమీ మాట్లాడకుండానే తిరుమలలో తాను ప్రవర్తించిన తీరుతో డిక్లరేషన్ వివాదం సద్దుమణిగిపోయేలా చేయగలిగారు.
పులివెందులలో వైయస్ కుటుంభం ఏమి చేస్తుంది?
సరే ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వైయస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైస్తవ మతమార్పుళ్ళు నిజంగానే జరుగుతున్నాయా అనే ప్రశ్న చాలా మందికి రావచ్చు. ఇది మీడియాలో సోషల్ మీడియాలో వచ్చే కథనాల వల్ల కావచ్చు లేకపోతే రెండు మూడు ప్రధాన పత్రికల్లో వచ్చే వార్తల వల్ల కావచ్చు. ఈ అనుమానులు అపోహలు నివృత్తి కావాలంటే పులివెందుల పరిస్థితి మనం పరిశీలించాలి.
గత నలభై సంవత్సరాల పైగా వైఎస్ కుటుంబం పులివెందుల ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఒకవేళ వైఎస్ కుటుంబానికి క్రైస్తవ మీద ప్రేమ ఎక్కువై జనాలను అందరిని క్రైస్తవులు గా మార్చాలి అనుకుంటే తాము 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ, కనీస స్థాయిలో ప్రతిపక్షం లేని ఆ నియోజకవర్గంలో క్రైస్తవ మతం ఎంత శాతం ఉండాలి? జనాభా లెక్కలు పరిశీలించినప్పుడు పులివెందులలో ఉన్న సుమారు 70 వేల జనాభాలో 82 శాతం మంది హిందువులు అయితే 15 శాతం ముస్లిమ్స్ ఉండగా కేవలం రెండు శాతం లోపలే క్రైస్తవులు వున్నారు. వైయస్ కుటుంభం క్రైస్తవ మతం ప్రోత్సహిస్తోందని ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు నిజమైతే క్రైస్తవ జనాభా పులివెందులలో ఎంతుండాలి? కనీసం 20 నుండి 30 శాతం వరకు ఉండాలి. కానీ అక్కడ పరిస్థితి అలా లేదు. ఈ గణాంకాలు వైఎస్ కుటుంబానికి మతమార్పిళ్లు మీద వున్న అభిప్రాయం తెలియజేస్తుంది.
అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి మతాల మధ్య చిచ్చుపెట్టె రాజకీయాలు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూసే ప్రతిపక్షాలు పులివెందుల జనాభా లెక్కలు చూసిన తర్వాత అయినా తమ పంథాని మార్చుకోవాలి.