Y.S.Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కూటమి సర్కారు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శలు కురిపించారు.
సూపర్ సిక్స్ అంటూ అబద్ధపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని కేవలం అధికారంలోకి రావడం కోసమే సూపర్ సిక్స్ అంటూ ప్రచారం చేశారని జగన్ తెలిపారు. ఇలా అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారని తప్పుపట్టారు. కేవలం అమరావతిని నిర్మించడం కోసం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని జగన్ ఫైర్ అయ్యారు.
చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీలు దొంగ హామీలకు నిరసనగా జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా నిరసనలు తెలియ చేయాలి అంటూ పిలుపునిచ్చారు.ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని తెలిపారు.ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారు.
జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలుబడ్డాయి. అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి అవుతున్న ఇప్పటివరకు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కారుపై వ్యతిరేకత వస్తుంది.