ఏపీ రాజకీయాలు మరొక మలుపు తీసుకుంటున్నాయా అంటే అవునంటున్నారట విశ్లేషకులు.. ఇప్పటికే వైసీపీ అధినేత ఏపీ సీయం వైఎస్ జగన్ ఈ నెల 10వ తేదీన ఏపీ హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీరమణపై, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా ఈ వివాదం దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రచారాన్ని చూరగొంది.. ఇక ఈ లేఖను న్యాయవాదులు గట్టిగా ఖండిస్తున్నారు. మరికొందరు సీయం కుర్చీ నుండి వైఎస్ జగన్ తప్పుకోవాలని అంటున్నారు.. కొందరైతే కోర్టుల్లో పిటిషన్లు వేసి చర్యలకు డిమాండ్లు చేస్తుండగా, మరికొందరు వైఎస్ జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు.. ఇలా ఈ మ్యాటర్ ఒక హట్ బెలూన్‌లా మారిపోయింది..
ఇప్పటికే న్యాయవ్యవస్ద మీద ఏపీ సీయం దాడి చేసి దాన్ని నవ్వుల పాలు చేస్తున్నారంటూ ఢిల్లీ బార్ అసోసియేషన్ అభివర్ణిస్తూ, ఇతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ లేఖ విషయంలో వైఎస్ జగన్ మీద, నోయిడాకు చెందిన ఒక న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్న విషయం విదితమే. పైకి తేటగా కనిపిస్తున్న ఈ వివాదం లోలోపల మాత్రం దేశ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తుంది.. దీంతో వైసీపీ వర్గాల్లో ఏం చర్చ జరిగిందో తెలియదు గానీ, వైఎస్ జగన్ నుండి అందిన ఆదేశాల సారం ఏంటో గానీ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం సీజేఐకు జగన్ రాసిన లేఖపై వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా నోరు మెదప వద్దని ఆదేశాలు జారీచేశారట..
అదీగా ఈ అంశం పై ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, బహిరంగంగా మాట్లాడటం కానీ, పత్రికా ప్రకటనలు విడుదల చేయడం కానీ చేయవద్దని పేర్కొన్నారట.. ముందుగా తెగేదాక లాగిన ఈ వ్యవహారాన్ని చివరకు చప్పగా మార్చేసేలా చేస్తున్నారేంటి అనుకుంటున్న వైసీపీ నాయకులు వైఎస్ జగన్ ఈ వ్యవహారంలో తెగువ చూపిస్తాడనుకుంటే ఇలా చేశాడేంటి అని ఆశ్చర్యపోతున్నారట.. మరి త్వరలోనే ఈ వివాదంలో కాంప్రమైజ్ జరగనుందా..? ఈ అంశం కనుమరుగు కానుందా అనే ఆలోచనలతో కొందరి బుర్రలు వేడెక్కిపోతున్నాయట..