AP: వైఎస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో ఘోరమైన ఓటమిని చవిచూసిన తర్వాత తిరిగి ఆయన మొదటి నుంచి తన పార్టీనీ పూర్తిస్థాయిలో బలోపేతం చేయటం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి తిరిగి తన పార్టీకి బలమైన పునాదులు వేయటం కోసం జగన్ పక్క వ్యూహాలు రచిస్తున్నారు.
ఇకపోతే ఉగాది పండుగ తర్వాత ఈయన జిల్లాల పర్యటన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. వైసీపీ పార్టీలో యంగ్ లీడర్లకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈయన నిర్ణయాలు తీసుకుంటున్నారు.తాజాగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా జగన్ ప్రమోషన్ ఇచ్చారు.యూత్ అలాగే మాస్ ఫాలోయింగ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి
వైసిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.
ఇకపోతే ఈయన ఉగాది పండుగ తరువాత ప్రజలలోకి రాబోతున్నారు ప్రతి పార్లమెంట్ పరిధిలో పర్యటనలు చేస్తూ రెండు రోజులపాటు ఆయా జిల్లాలలో పర్యటన కొనసాగిస్తూ అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ కూటమీ ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి జనాలలోకి రాబోతున్న నేపథ్యంలోనే ఇప్పుడే గ్రౌండ్ స్థాయిలో వైసిపి నేతలకు పదవులు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి యంగ్ లీడర్లకు…. జగన్మోహన్ రెడ్డి పదవులు కట్టబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంత మేరకు వర్కౌట్ అవుతాయో తెలియాల్సి ఉంది.