వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తే మోడీ రంగంలోకి దిగాడట.. డ్యామిడ్ కధ అడ్దం తిరిగినట్లుందే.. ?

jagan modi telugu rajyam

 

ఏపిలో అధికార పార్టీ అయిన వైసీపీని ఎన్నో విధాలుగా విమర్శిస్తూ ఆ పార్టీని ప్రజల్లో చెడ్దగా చిత్రీకరించాలని ప్లాన్లు ఇప్పటి వరకు బాగానే జరిగాయట.. నిన్నమొన్నటి వరకు బీజేపీ, జనసేన ఈ విషయంలో ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినారట.. ఇక టీడీపీ అయితే ఎప్పుడు గుంటనక్కలా కాచుక్కూర్చోవడం తెలిసిందే.. ఇప్పటికి కూడా తమ అక్కసును అధికార పార్టీ మీద పచ్చ చొక్కాలు వెళ్లగక్కుతూనే ఉంటాయి.. ఇక బీజేపీ కూడా ఏపీలో జండా పాతాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది.. ఇందుకు గాను జనసేన పొత్తు కూడా పెట్టుకుంది..Janasena and BJP Alliance

ఇలాంటి సమయంలో అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేసి, రానున్న 2024 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఏపీ బీజేపీ నాయకుల్లో మొన్నటి వరకు కనిపించింది. ఈ దశలో బీజేపీ సోము వీర్రాజు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, జనసేన పార్టీ తో కలిసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఉమ్మడిగా ఒక కార్యాచరణ సైతం రూపొందించుకున్నారు..

సరిగ్గా ఈ స్పీడ్ కొనసాగుతుండగానే, కేంద్ర బీజేపీ పెద్దలు వైసీపీని దగ్గర చేసుకోవడం, ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం, ఎన్డీఏలో చేరేందుకు వైసీపీని ఆహ్వానించడం వంటి వ్యవహారాలు ఏపీ బీజేపీ నేతలతో పాటు, పవన్ కు సైతం ఆగ్రహం కలిగించాయట. దీనికంటే ముందే ఏపీలో జరిగిన హిందు వ్యతిరేక కార్య కలాపాల గురించి కేంద్ర బీజేపీ పెద్దలకు జనసేన, ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదులు చేయగా ఇక వైఎస్ జగన్‌కు మూడింది అని అంతా అనుకున్నారట..

సరిగ్గా ఇదే సమయంలో అకస్మాత్తుగా ప్రధాని నరేంద్ర మోదీ జగన్ ను ఢిల్లీకి పిలిపించి చర్చించిన దగ్గర నుంచి సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందట.. ఇక అధికార పార్టీ విదివిధానాలను వ్యతిరేకిస్తూ జనసేన, ఏపీ బీజేపీ దసరా నుంచి పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకున్న తరుణంలో ఈ ప్లాన్ ప్రారంభంలోనే ముగిసిపోయింది. ఇక ప్రస్తుత పరిస్దితిని గమనిస్తే వైసీపీ పైన విమర్శలు చేసేందుకు బీజేపీ నాయకులు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ పనిచేసే చేసే అవకాశం ఉంది.

కాగ కేంద్ర బీజేపీ పెద్దలు వైఎస్ జగన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని, ఆయనకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించ వద్దని సంకేతాలు ఇవ్వడంతోనే, ఏపిలో ఉన్న బీజేపీ నాయకులు ఇలా మౌనంగా ఉండిపోయినట్టుగా ప్రచారం అవుతుంది.. ఇలాంటి పరిస్దితుల్లో వైసీపీని విమర్శించే సాహసం దుస్సాహసామే. అందుకే వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తే మోడీ రంగంలోకి దిగడం ఏంటి.. డ్యామిడ్ కధ అడ్దం తిరిగినట్లుంది అని అనుకుంటున్నారట..