Y.S.Jagan: దాయాది పాకిస్థాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు. నేడు ఆయన బెంగుళూరు నుంచి నేరుగా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తాండకు వెళ్లారు. పాకిస్తాన్ కాల్పులలో మరణించిన మురళి నాయక్ కుటుంబాన్ని పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు.
ఈ క్రమంలోని నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు ఈయన బెంగళూరు నుంచి నేరుగా రోడ్డు మార్గాన కల్లి తాండాకు చేరుకున్నారు. మురళి నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇలా మురళి నాయక్ తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..వీర జవాన్ చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది అని తెలిపారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఆయన సాహసం అందరికీ స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు. అదేవిధంగా మురళి నాయక్ కుటుంబానికి తమ పార్టీ ఎప్పుడూ కూడా భరోసా ఇస్తుందని తెలిపారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మురళి నాయక్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు.
ఇక జగన్మోహన్ రెడ్డి మురళి నాయక్ ఇంటిలోకి అడుగుపెట్టగానే మురళి నాయక్ తండ్రి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ… రేయ్ మురళి నీకోసం జగన్ సార్ వచ్చారు. ఒక్కసారి లేచి సార్ కి సెల్యూట్ కొట్టరా అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అతని మాటలు అక్కడున్న వారందరి చేత కంటతడి పెట్టించాయి.