నీ రౌడీ రాజకీయాలు పనికిరావు.. అవినాష్ కు కేశినేని హెచ్చరిక

kesineni nani

 విజయవాడలో రాజకీయం బాగా వేడెక్కింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటంతో టీడీపీ మరియు వైసీపీ పార్టీ నేతలు విజయవాడ లో తమ తమ పట్టు నిలుపుకోవటం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని బెజవాడ లో తన దూకుడు చూపిస్తూ, ఇటు సొంత పార్టీ నేతలను, అటు వైసీపీ నేతలను టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నాడు.

kesineni nani

 తాజాగా వైసీపీ నేత దేవినేని అవినాష్ కు గట్టి హెచ్చరిక జారీ చేశాడు . విజయవాడ గుణదల డివిజన్ మూడో వార్డులో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి వాణిఫై దాడి చేయడాన్ని ఎంపీ కేశినేని నాని తీవ్రంగా ఖండించారు. పద్థతి మార్చు కోవాలని దేవినేని అవినాష్‌ను ఎంపీ సూటిగా హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం పదవి అనుభవించి తర్వాత పార్టీ పిరాయించడంపైన విమర్శించారు. విజయవాడ ప్రజలు శాంతి భద్రతలను కోరుకుంటున్నారని, గుండాయిజం మానుకోకపోతే మహిళలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.

 మీ నాన్న టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీలోకి వచ్చి చంద్రబాబుకు రక్షగా నేను ఉంటాను అని అన్నాడు. పార్టీ అధికారంలో లేని సమయంలో లేని రక్షణ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు..? అని మాకు అనిపించినా సరేలే పెద్దాయన కదా అని సైలెంట్ గా ఉన్నాం, ఆ తర్వాత నిన్ను తెలుగుయువత అధ్యక్షుడిని చేసిన తర్వాత రోజు చంద్రబాబుకు, లోకేష్ కు పాలాభిషేకాలు చేశావు . ఆ తర్వాత అధికారం మారిపోవడంతో నువ్వు మారిపోయి వైసీపీ నేతలకు పాలాభిషేకాలు చేస్తున్నావు.

 రాజకీయంగా నీకు చాలా భవిష్యత్తు ఉంది, కాబట్టి అందరి ప్రేమాభిమానాలు పొందటానికి చూడు, గతంలో మాదిరి హత్య రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు చేయాలంటే ఇప్పుడు కుదరదు, నీలాంటి వాళ్ళని చాలా మందినే చూసాను, కాబట్టి జాగ్రతగా ఉండు అంటూ దేవినేని అవినాష్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు . మహిళపై దాడి చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఎంపీ ప్రశ్నించారు. పోలీసులు పద్ధతి మార్చుకుని శాంతి భద్రతలను కాపాడాలన్నారు. విజయవాడలో టీడీపీ విజయం ఖాయమన్నారు.